ఢిల్లీ విడిచి వెళ్లేందుకు సిద్ధమైన సోనియా..?

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కొంతకాలం పాటు దేశ రాజధానిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అనుకుంటున్నారా? ఢిల్లీ దాటితేనే ఆమె ఆరోగ్యం కుదుటపడనుందా? అసలు డాక్టర్లు ఏం చెప్పారు…? గాంధీ ఫ్యామిలీ ఏం డిసైడ్ అయింది..? ఒకవేళ రాజధానికి టాటా చెప్తే ఆమె రూట్ ఎటు? రాష్ట్రం మారుస్తారా? దేశం దాటేస్తారా? ఇప్పుడు నేషనల్ వైడ్ హాట్ టాపిక్ ఇదే..! సోనియా గాంధీ కొన్నేళ్లుగా శ్వాసకోశ సంబంధ ఇబ్బందులతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో […]

Update: 2020-11-20 03:36 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కొంతకాలం పాటు దేశ రాజధానిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అనుకుంటున్నారా? ఢిల్లీ దాటితేనే ఆమె ఆరోగ్యం కుదుటపడనుందా? అసలు డాక్టర్లు ఏం చెప్పారు…? గాంధీ ఫ్యామిలీ ఏం డిసైడ్ అయింది..? ఒకవేళ రాజధానికి టాటా చెప్తే ఆమె రూట్ ఎటు? రాష్ట్రం మారుస్తారా? దేశం దాటేస్తారా? ఇప్పుడు నేషనల్ వైడ్ హాట్ టాపిక్ ఇదే..!

సోనియా గాంధీ కొన్నేళ్లుగా శ్వాసకోశ సంబంధ ఇబ్బందులతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ నగరంలో వాయు కాలుష్యం తీవ్రంగా ఉండడంతో కొంతకాలం పాటు ఆమె రాజధానిని విడిచి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఆమె అనారోగ్య సమస్య కొంచెం ఇబ్బందికరంగా మారడంతో డాక్టర్లు ఇచ్చిన సలహా మేరకు చెన్నయ్ లేదా గోవాకు వెళ్ళనున్నట్లు సమాచారం. ఢిల్లీ నగరంలో తీవ్రమైన చలి, వాతావరణంలో ఆక్సిజన్ స్థాయి పడిపోవడం, కాలుష్యం బాగా పెరిగిన కారణంగా కొంతకాలం సమ శీతోష్ణ పరిస్థితులు ఉండేచోటికి వెళ్ళడం ఉత్తమం అని డాక్టర్లు ఆమెకు సూచించారు. కొడుకు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంకాగాంధీలతో కలిసి చెన్నయ్ నగర శివారు ప్రాంతం లేదా గోవాకు సమీపంలో కొంతకాలం ఉండేలా ప్లాన్ జరుగుతోందని కాంగ్రెస్ సీనియర్ నాయకుల సమాచారం.

అనారోగ్యం కారణంగానే సెప్టెంబరు నెలలో వైద్యులను కలవడానికి విదేశాలకు వెళ్ళిన సోనియాగాంధీ పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు సైతం హాజరుకాలేదు. అంతకుముందు జూలై నెలలో సైతం అనారోగ్యం కారణంగా గంగారాం ఆసుపత్రిలో చేరారు. ఇప్పుడు ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న సోనియాగాంధీకి ఢిల్లీ వాతావరణ సరిపడదని డాక్టర్లు సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. చలి, కాలుష్యం తదితర సమస్యలు ఢిల్లీ నగరంలో తీవ్ర స్థాయిలో ఉన్నందున పరిస్థితి అనుకూలంగా మారేంత వరకు ఢిల్లీకి బైట ఉండడమే శ్రేయస్కరమని ఇచ్చిన సలహా మేరకు.. కొన్ని వారాల పాటు దక్షిణాదినే ఉండాలని ఆమె నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

వచ్చే నెలల పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఉన్నందున వాటికి కూడా ఆమె హాజరయ్యే అవకాశాలు కనిపించడంలేదు. మరోవైపు ఢిల్లీ నగరంలో కరోనా వైరస్ వ్యాప్తి కూడా ప్రమాదకర స్థాయిలో ఉన్నందున వైద్యుల సలహా మేరకు కొన్ని వారాలపాటు ఆమె ఢిల్లీ నగరానికి దూరంగా ఉండటమే మంచిదని గాంధీ ఫ్యామిలీ డిసైడ్ అయ్యారట. ఇక సోనియమ్మ కూడా ఢిల్లీ నుండి పయనమయ్యేందుకు సిద్ధం అయినట్లు సమాచారం.

Tags:    

Similar News