ధోనీకి ఆటపై ఇంట్రెస్ట్ పోయిందా?

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ గత రెండు సీజన్ల ముందు ధోనీ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు, ఫొటోలే మీడియాలో ఎక్కువగా కనిపించేవి. నెట్స్‌లో సిక్సులు బాదుతున్నాడంటూ వార్తలు హల్‌చల్ చేసేవి. అయితే మ్యాచ్‌లో దిగినప్పుడు మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపించేది. గత ఏడాది కెప్టెన్‌గా కూడా పూర్తిగా విఫలమైన ధోనీ.. ఈ సారి మాత్రం జట్టును గెలిపిస్తున్నాడు. కెప్టెన్‌గా మార్కులు పడుతున్నా.. బ్యాట్స్‌మాన్‌గా మాత్రం విఫలమవుతున్నాడు. సోమవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్ చేయలేక ఆపసోపాలు […]

Update: 2021-04-20 07:57 GMT

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ గత రెండు సీజన్ల ముందు ధోనీ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు, ఫొటోలే మీడియాలో ఎక్కువగా కనిపించేవి. నెట్స్‌లో సిక్సులు బాదుతున్నాడంటూ వార్తలు హల్‌చల్ చేసేవి. అయితే మ్యాచ్‌లో దిగినప్పుడు మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపించేది. గత ఏడాది కెప్టెన్‌గా కూడా పూర్తిగా విఫలమైన ధోనీ.. ఈ సారి మాత్రం జట్టును గెలిపిస్తున్నాడు. కెప్టెన్‌గా మార్కులు పడుతున్నా.. బ్యాట్స్‌మాన్‌గా మాత్రం విఫలమవుతున్నాడు. సోమవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్ చేయలేక ఆపసోపాలు పడ్డాడు.

17 బంతుల్లో 18 పరుగులు సాధించినా.. మొదట్లో బంతులను కొట్టలేక ఇబ్బందికి గురయ్యాడు. మ్యాచ్ అనంతరం ఇదే విషయాన్ని ప్రశ్నించగా విభిన్నంగా స్పందించాడు. ‘నేను ఏ రోజూ ఉత్తమ ప్రదర్శన చేస్తానని ఎవరికీ హామీ ఇవ్వను. నేను అంతర్జాతీయ క్రికెట్ ఆడటం మొదలు పెట్టినప్పుడు 24 ఏళ్ల వయసు. అప్పుడూ ఎవరికీ హామీ ఇవ్వలేదు.. ఇప్పుడు 40 ఏళ్ల వయసులో కూడా హామీ ఇవ్వను’ అంటూ సమాధానం ఇచ్చాడు. ధోనీ వ్యాఖ్యలు గమనించిన విశ్లేషకులు అతడిలో ఇంట్రెస్ పోయిందని అంటున్నారు. ప్రస్తుతం క్రికెట్‌లో ధోనీ కొత్తగా సాధించాల్సింది ఏమీ లేదని.. ఏదో ఐపీఎల్‌ను కాలక్షేపం కోసం ఆడుతున్నట్లు ఉందని అంటున్నారు. ఈ మధ్య ధోనీ ఆటతీరు చూస్తుంటే విమర్శకుల వ్యాఖ్యలు కూడా నిజమేననిపిస్తున్నాయి. ధోనీ ఆటతీరు కూడా అలాగే ఉండటం గమనార్హం.

Tags:    

Similar News