ఆహా… కీర్తి పెళ్లి అంటా…?
అలనాటి మహానటిని మరిపించిన… నేటి మహానటి కీర్తి సురేష్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోందట. మహానటి సినిమాకు ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు అందుకున్న అందాల బొమ్మ.. త్వరలో పెళ్లి కూతురు కాబోతుందని కోలీవుడ్ ఇండస్ట్రీ టాక్. ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ సినిమాలతో బిజీగా ఉన్న కీర్తి…. ఈ ఏడాది చివర్లో వివాహం చేసుకోబోతుందట. పొలిటికల్ లీడర్ కొడుకు అయిన ఓ బిజినెస్ మెన్ ను తన జీవిత భాగస్వామిగా ఎంచుకుందని సమాచారం. ఇప్పటికే అతనితో […]
అలనాటి మహానటిని మరిపించిన… నేటి మహానటి కీర్తి సురేష్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోందట. మహానటి సినిమాకు ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు అందుకున్న అందాల బొమ్మ.. త్వరలో పెళ్లి కూతురు కాబోతుందని కోలీవుడ్ ఇండస్ట్రీ టాక్. ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ సినిమాలతో బిజీగా ఉన్న కీర్తి…. ఈ ఏడాది చివర్లో వివాహం చేసుకోబోతుందట. పొలిటికల్ లీడర్ కొడుకు అయిన ఓ బిజినెస్ మెన్ ను తన జీవిత భాగస్వామిగా ఎంచుకుందని సమాచారం. ఇప్పటికే అతనితో స్నేహం చేసిన కీర్తి… పెద్దల మద్దతుతో ఘనంగా పెళ్లి చేసుకోబోతోందని తెలుస్తోంది. ఇప్పటి వరకు పూర్తి వివరాలు తెలియకపోయినా పెళ్లి వార్తలు హల్ చల్ చేస్తుండడం పై కీర్తి ఎలా స్పందిస్తుందో చూడాలి మరి. ఆహా నా పెళ్లి అంటా… ఓహో నా పెళ్లి అంటా… అని పాట పాడుతుందో లేక ఏంటి ఈ ఫేక్ న్యూస్ అని క్లాస్ పీకుతుందో చూడాలి.
మలయాళం సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేశ్ … తెలుగులో ‘నేను శైలజ’ చిత్రం ద్వారా పరిచయం అయింది. తర్వాత వరుస సినిమాలు చేసిన కీర్తికి …” మహానటి “సినిమా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చి పెట్టింది. ప్రస్తుతం తెలుగులో నితిన్ “రంగ్ దే ” సినిమాలో చేస్తుంది కీర్తి.
Tags: Keerthi suresh, mahanati, nenu shailaja, marraige