ఆ మాజీ హీరోయిన్‌కు కరోనా పాజిటివ్?

దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తి చెందుతూ, విలయ తాండవం చేస్తోంది. రోజూ 20 వేలకు పైగా కేసులు నమోదు అవుతూ, ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నది. సామాన్య ప్రజలతో పాటు ఎన్నో జాగ్రత్తలు తీసుకునే వైద్యులు, పోలీసులు, ప్రజా ప్రతినిధులు, సినీ, క్రీడా ప్రముఖులు సైతం కరోనా బారినపడుతున్నారు. తాజాగా ప్రముఖ నటి, ఎంపీ సుమలతకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఐతే ఒక ఎంపీగా తన నియోజకవర్గంలోని పలు ప్రాంతాలను […]

Update: 2020-07-06 08:36 GMT

దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తి చెందుతూ, విలయ తాండవం చేస్తోంది. రోజూ 20 వేలకు పైగా కేసులు నమోదు అవుతూ, ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నది. సామాన్య ప్రజలతో పాటు ఎన్నో జాగ్రత్తలు తీసుకునే వైద్యులు, పోలీసులు, ప్రజా ప్రతినిధులు, సినీ, క్రీడా ప్రముఖులు సైతం కరోనా బారినపడుతున్నారు. తాజాగా ప్రముఖ నటి, ఎంపీ సుమలతకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఐతే ఒక ఎంపీగా తన నియోజకవర్గంలోని పలు ప్రాంతాలను సందర్శించిన సుమలత.. కరోనా వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ క్రమంలోనే శనివారం ఆమెకు తలనొప్పి, గొంతు నొప్పి రావడంతో అనుమానం వచ్చి.. కరోనా పరీక్షలు చేయించుకున్నారు. దానికి సంబంధించి రిపోర్ట్ సోమవారం రాగా.. అందులో కరోనా పాజిటివ్ వచ్చింది.

ప్రస్తుతం సుమలత హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. డాక్టర్ సలహాతో ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. ప్రజలందరి ఆశీర్వాదంతో.. త్వరలోనే కరోనా నుంచి బయటపడతానని ఆమె చెప్పారు. ఇటీవల తాను కలిసిన వారందరి వివరాలను అధికారులు వెల్లడించారని తెలిపారు. వారంతా వీలైనంత త్వరగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కాగా, సుమలత తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళ చిత్రాల్లో నటించారు. జీ తెలుగులో ప్రసారమవుతున్న బతుకు జట్కా బండి కార్యక్రమానికి కొన్ని రోజుల పాటు హోస్ట్‌గా వ్యవహరించారు. ఇక 2019 లోక్‌సభ ఎన్నికల్లో మాండ్యా లోక్‌సభ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. జేడీఎస్ అభ్యర్థి, దేవెగౌడ మనవడు నిఖిల్‌పై గెలిచి..పార్లమెంట్‌లో అడుగుపెట్టారు.

Tags:    

Similar News