Andhra Pradesh : ఏపీలో సంపూర్ణ లాక్‌డౌన్?

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో మధ్యాహ్నం, రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తున్నా.. కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. రోజువారీ కేసులు 20 వేలకుపైగా నమోదవుతూనే ఉన్నాయి. దీంతో లాభం లేదని భావించిన ఏపీ సర్కార్.. సంపూర్ణ లాక్‌డౌన్ దిశగా అడుగులు వేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక లాక్‌డౌన్ ప్రకటించాయి. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం కూడా సంపూర్ణ లాక్‌డౌన్ విధించాలని యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సంపూర్ణ లాక్‌డౌన్ విధించకపోతే కరోనాను కట్టడి […]

Update: 2021-05-16 05:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో మధ్యాహ్నం, రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తున్నా.. కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. రోజువారీ కేసులు 20 వేలకుపైగా నమోదవుతూనే ఉన్నాయి. దీంతో లాభం లేదని భావించిన ఏపీ సర్కార్.. సంపూర్ణ లాక్‌డౌన్ దిశగా అడుగులు వేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక లాక్‌డౌన్ ప్రకటించాయి.

ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం కూడా సంపూర్ణ లాక్‌డౌన్ విధించాలని యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సంపూర్ణ లాక్‌డౌన్ విధించకపోతే కరోనాను కట్టడి చేయడం కష్టమని ఆరోగ్యశాఖ అధికారులు జగన్‌కు నివేదించినట్లు సమాచారం. ఏపీలో ఇప్పటికే పాజిటివిటీ రేట్ 20 శాతం దాటిందని, లాక్ డౌన్ పెట్టాలని అధికారులు సూచించినట్లు తెలుస్తోంది. అధికారుల సూచనతో త్వరలో లాక్ డౌన్‌పై జగన్ నిర్ణయం తీసుకునే అవకాశముంది.

Tags:    

Similar News