తాలిబన్లకు ఇరాన్ ఆయిల్ సరఫరా
దిశ వెబ్‌డెస్క్: ఆప్ఘాన్‌లో కొత్తగా రాబోతున్న ప్రభుత్వానికి ముడి చమురును ఎగుమతి చేయడానికి ఇరాన్ అంగీకరించింది. ఈ మేరకు ఇరాన్ అధ్యక్షుడు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. దేశంలో సంక్షోభ పరిస్థితులుండటంతో ఆగష్టు 6 నుంచి ఆప్ఘాన్‌కు ఆయిల్ సరఫరాను ఇరాన్ నిలిపివేసింది. దాంతో టన్ను గ్యాసోలిన్ ధర దాదాపు 900 డాలర్లకు చేరింది. దేశంలో పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటడంతో ప్రజలు తీవ్రంగా ఇక్కట్లు పడుతున్నారని భావించిన తాలిబన్లు, వెంటనే ఇరాన్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. అఫ్రష్ ఘనీ […]
దిశ వెబ్‌డెస్క్: ఆప్ఘాన్‌లో కొత్తగా రాబోతున్న ప్రభుత్వానికి ముడి చమురును ఎగుమతి చేయడానికి ఇరాన్ అంగీకరించింది. ఈ మేరకు ఇరాన్ అధ్యక్షుడు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. దేశంలో సంక్షోభ పరిస్థితులుండటంతో ఆగష్టు 6 నుంచి ఆప్ఘాన్‌కు ఆయిల్ సరఫరాను ఇరాన్ నిలిపివేసింది. దాంతో టన్ను గ్యాసోలిన్ ధర దాదాపు 900 డాలర్లకు చేరింది. దేశంలో పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటడంతో ప్రజలు తీవ్రంగా ఇక్కట్లు పడుతున్నారని భావించిన తాలిబన్లు, వెంటనే ఇరాన్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. అఫ్రష్ ఘనీ ప్రభుత్వ కాలంలో దాదాపు 40 వేల బారెళ్లను కాబూల్ దిగుమతి చేసుకునేది. ప్రస్తుతం అంతే మొత్తంలో తమకు ముడి చమురును పంపాలని కోరటంతో ఇరాన్ ‘సై’ అన్నట్లు సమాచారం.
ఇరాన్‌తో ఉన్న సరిహద్దులను మూసివేయవద్దని తాలిబన్లు ఇప్పటికే తమ దేశ ఫైటర్లను ఆదేశించారట. ఈ విషయాన్ని ఇరాన్ పెట్రోలియం ఉత్పత్తుల సమాఖ్య చీఫ్ హమీద్ హూస్సేనీ మంగళవారం వెల్లడించారు. దాంతో ఇరాన్, ఆప్ఘాన్ పై విధించిన పెట్రోలియం నిషేధాన్ని ఎత్తివేసింది. టెహ్రన్ నుంచి కాబూల్ ప్రధానంగా గ్యాసోలిన్, గ్యాసో ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటోంది. మరో సరిహద్దు దేశమైన తుర్క్‌మెనిస్థాన్, ఉజ్‌బెకిస్తాన్ నుంచి 257 మిలియన్ డాలర్లు, 236 మిలియన్ డాలర్ల విలువ గల ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. అయితే ఈ దేశాలు తాలిబన్ల పాలన వల్ల ఇబ్బందుల తలెత్తే అవకాశం ఉందని పెట్రోలియం ఎగుమతులను నిలిపివేశాయి.
ప్రస్తుతం ఇరాన్ మాత్రమే ఆయిల్ ఎగుమతి చేయడానికి అంగీకరించింది. వీటిని కాందహర్, నిమ్రోజ్ లో ఉన్న ఆయిల్ రిఫైనరీల ద్వారా శుద్ధి చేసి వినియోగించుకోవాలని తాలిబన్ పాలకులు ఆలోచిస్తున్నారు. అయితే ఇది కేవలం హజారా షియాల పై తాలిబన్లు ఎలా వ్యవహరిస్తారో అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. షియా ముస్లింలకు పెద్ద దిక్కులా వ్యవహరిస్తున్న ఇరాన్…ఆప్ఘాన్‌లోని నివసిస్తున్న హజారా షియా ముస్లింలకు ఏమాత్రం కీడు చేసిన తన ఎగుమతి పాలసీని మార్చుకునే అవకాశం ఉంది. తాలిబన్లు ఇంతకు ముందే హజారాలు ముస్లింలు కారని ప్రకటించిన విషయం తెలిసిందే.