ఏపీలో జోరుగా క్రికెట్ బెట్టింగ్ !

దిశ, ఏపీ బ్యూరో: ఐపీఎల్ 20-20 క్రికెట్ మ్యాచ్‌ల ఫీవర్ ​యువతలో జోష్ నింపుతోంది. బెట్టింగ్​ రాయుళ్లకు ఇదో పెద్ద ఆదాయ వనరుగా మారింది. కృష్ణా జిల్లా నూజివీడులో పెద్ద ఎత్తున బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న నలుగురు క్రికెట్ బుకీలు, 14మంది పంటర్లను ఆదివారం పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ.6.45లక్షలు నగదు, 17 సెల్‌ఫోన్లు, ఒక టీవీ ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. బుకీలు, పంటర్లను మచిలీపట్నంలో ఎస్పీ రవీంద్ర నాథ్ మీడియా ముందు ప్రవేశపెట్టారు. హైదరాబాద్ […]

Update: 2020-10-11 08:30 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఐపీఎల్ 20-20 క్రికెట్ మ్యాచ్‌ల ఫీవర్ ​యువతలో జోష్ నింపుతోంది. బెట్టింగ్​ రాయుళ్లకు ఇదో పెద్ద ఆదాయ వనరుగా మారింది. కృష్ణా జిల్లా నూజివీడులో పెద్ద ఎత్తున బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న నలుగురు క్రికెట్ బుకీలు, 14మంది పంటర్లను ఆదివారం పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ.6.45లక్షలు నగదు, 17 సెల్‌ఫోన్లు, ఒక టీవీ ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. బుకీలు, పంటర్లను మచిలీపట్నంలో ఎస్పీ రవీంద్ర నాథ్ మీడియా ముందు ప్రవేశపెట్టారు. హైదరాబాద్ నుంచి బెట్టింగ్ నిర్వహిస్తున్న ప్రధాన నిందితుడు, మరి కొందరు పంటర్లను అదుపులోకి తీసుకోవాల్సి ఉందని ఎస్పీ తెలిపారు.

Tags:    

Similar News