ఇల్లందులో జోరుగా ఐపీఎల్ బెట్టింగ్
దిశ, ఇల్లందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ కేంద్రంలో ఐపీఎల్ బెట్టింగ్ జోరు కొనసాగుతుంది. యువత ఈజీమనీ కోసం అలవాటు పడి, అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఐపీఎల్ బెట్టింగ్ కోసం వేలల్లో అప్పులు చేస్తున్నారు. ఐపీఎల్ కోసం సెల్ ఫోన్లు, బైకులు, గోల్డ్ చైన్లు తాకట్టు పెట్టి మరీ ఐపీఎల్ బెట్టింగ్‌లు కడుతున్నారు. పట్టణంలోని జగదాంబ సెంటర్, పాత బస్టాండ్, కొత్త బస్టాండ్, 24 ఏరియా, 21 ఏరియాల్లో బెట్టింగ్ హవా కొనసాగుతుంది. సెల్ ఫోన్‌ల […]
దిశ, ఇల్లందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ కేంద్రంలో ఐపీఎల్ బెట్టింగ్ జోరు కొనసాగుతుంది. యువత ఈజీమనీ కోసం అలవాటు పడి, అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఐపీఎల్ బెట్టింగ్ కోసం వేలల్లో అప్పులు చేస్తున్నారు. ఐపీఎల్ కోసం సెల్ ఫోన్లు, బైకులు, గోల్డ్ చైన్లు తాకట్టు పెట్టి మరీ ఐపీఎల్ బెట్టింగ్‌లు కడుతున్నారు. పట్టణంలోని జగదాంబ సెంటర్, పాత బస్టాండ్, కొత్త బస్టాండ్, 24 ఏరియా, 21 ఏరియాల్లో బెట్టింగ్ హవా కొనసాగుతుంది. సెల్ ఫోన్‌ల ద్వారా ఐపీఎల్ బెట్టింగ్‌లు కడుతూ ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం ద్వారా లక్షల్లో మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి చెడు వ్యసనాలకు యువతను దూరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుకొంటున్నారు.