ఐఫోన్ ఐవోఎస్ 13.6 ప్రత్యేకతలు మీకు తెలుసా?

దిశ, వెబ్ డెస్క్: ఐవోఎస్‌ 13.6 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను యాపిల్‌ కంపెనీ తమ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. డిజిటల్ కారు కీస్, హెల్త్‌యాప్‌ ఇందులోని ప్రత్యేకతలుగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఐవోఎస్‌ 13 ఆపరేటింగ్‌ సిస్టంపై నడుస్తున్న, మిగతా ఫోన్లలోనూ ఈ కొత్త ఐవోఎస్‌ను అప్‌డేట్‌ చేసుకోవచ్చు. ఐవోఎస్ 13.6 అపడేట్ చేసుకోవడానికి 390 ఎంబీ డేటా ఖర్చవుతుంది. ఐఫోన్ 6ఎస్‌తో పాటు ఆ తర్వాత విడుదలైన అన్ని ఐఫోన్లలోనూ దీన్ని అప్‌డేట్ చేసుకోవచ్చు. సెవెంత్ ఐపాడ్ జనరేషన్ […]

Update: 2020-07-17 00:23 GMT

దిశ, వెబ్ డెస్క్: ఐవోఎస్‌ 13.6 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను యాపిల్‌ కంపెనీ తమ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. డిజిటల్ కారు కీస్, హెల్త్‌యాప్‌ ఇందులోని ప్రత్యేకతలుగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఐవోఎస్‌ 13 ఆపరేటింగ్‌ సిస్టంపై నడుస్తున్న, మిగతా ఫోన్లలోనూ ఈ కొత్త ఐవోఎస్‌ను అప్‌డేట్‌ చేసుకోవచ్చు. ఐవోఎస్ 13.6 అపడేట్ చేసుకోవడానికి 390 ఎంబీ డేటా ఖర్చవుతుంది. ఐఫోన్ 6ఎస్‌తో పాటు ఆ తర్వాత విడుదలైన అన్ని ఐఫోన్లలోనూ దీన్ని అప్‌డేట్ చేసుకోవచ్చు. సెవెంత్ ఐపాడ్ జనరేషన్ యూజర్లు కూడా అప్‌డేట్‌ నో డౌట్‌గా చేసుకోవచ్చు.

ఫీచర్స్..

డిజిటల్ కార్ కీస్: ఈ కొత్త ఆపరేటింగ్‌ సిస్టంలో కారు కీ ఫీచర్‌ ప్రత్యేకమైనది.
– ఐఫోన్‌తోనే కారును స్టార్ట్‌, లాక్‌, అన్‌లాక్‌ చేయొచ్చు.
– మరొకరితో కూడా డిజిటల్ కీని పంచుకోవచ్చు.
అయితే, మొదట ఈ ఫీచర్‌ బీఎండబ్ల్యూ 5-సిరీస్‌కు సపోర్ట్‌ చేస్తుంది. కొద్ది రోజుల్లో మిగతా కార్లను కూడా యాపిల్‌ కంపెనీ ఈ జాబితాలో చేర్చనుంది.

హెల్త్‌యాప్‌ :

మన ఆరోగ్య సమాచారాన్ని ట్రాక్‌చేయడానికి ఇది దోహదపడుతుంది.
– జ్వరం, జలుబు, గొంతు లేదా దగ్గు ఉంటే ఆయా లక్షణాలు ఈ యాప్ గుర్తించి.. థర్డ్‌పార్టీ యాప్‌నకు చేరవేస్తుంది.

ఆపిల్ న్యూస్:

ఆడియో బ్రీఫింగ్ ఇప్పుడు యూఎస్‌లో అందుబాటులో ఉంది. ఆడియో కథలను కలిగి ఉన్న ఈ క్యూరేషన్‌లో ప్రాంతీయ వార్తా సంస్థల నుంచి కంటెంట్ అప్‌లోడ్‌ అవుతుంది. ప్రతివారం 20 ఆడియో కథలు ఉంటాయి. వీటిని ప్రొఫెషనల్ వాయిస్ నటీనటులు వివరిస్తారు.

ఆటోమేటిక్ అప్‌డేట్స్ :

వైఫై అందుబాటులో ఉన్న సమయంలో… ఆటోమేటిక్‌గా న్యూ అపడేట్స్ డౌన్‌లౌడ్ కావడంతో పాటు.. ఇన్‌స్టాల్ అవుతాయి. డౌన్‌లోడ్ ఐవోఎస్ అప్‌డేట్స్ అనే అప్షన్ బై డిఫాల్ట్‌గా వైఫై ఉంటే.. ఆన్ అవుతుంది.

డౌన్‌లోడ్ ఇలా :

ఐఫోన్‌లో సెట్టింగ్స్‌- జనరల్‌లోకి వెళ్లి సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌‌పై క్లిక్‌ చేస్తే న్యూ అప్‌డేట్‌ కనిపిస్తుంది. దాన్ని డౌన్‌లోడ్‌ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకోవాలి.

Tags:    

Similar News