జూలైలో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్?
న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమాన సేవలను పునరుద్ధరించడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉంది. అన్ని అనుకున్నట్టు జరిగితే జూలైలో ఈ సేవలు అందుబాటులోకి రావొచ్చని కేంద్ర పౌర విమానయాన శాఖ వర్గాలు తెలిపాయి. పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి చేసిన ట్వీట్‌ను ఈ కోణంలోనే చూస్తున్నారు. పరిస్థితులను ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తున్నామని, సాధారణ స్థితి నెలకొనగానే అంతర్జాతీయ విమాన సేవలను పునరుద్ధరించే నిర్ణయాన్ని తీసుకుంటామని మంత్రి ట్వీట్ చేశారు. అంతేకాదు, మనం నడపాలనుకునే దేశాలూ విమాన […]
న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమాన సేవలను పునరుద్ధరించడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉంది. అన్ని అనుకున్నట్టు జరిగితే జూలైలో ఈ సేవలు అందుబాటులోకి రావొచ్చని కేంద్ర పౌర విమానయాన శాఖ వర్గాలు తెలిపాయి. పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి చేసిన ట్వీట్‌ను ఈ కోణంలోనే చూస్తున్నారు. పరిస్థితులను ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తున్నామని, సాధారణ స్థితి నెలకొనగానే అంతర్జాతీయ విమాన సేవలను పునరుద్ధరించే నిర్ణయాన్ని తీసుకుంటామని మంత్రి ట్వీట్ చేశారు. అంతేకాదు, మనం నడపాలనుకునే దేశాలూ విమాన సేవలకు అనుమతిలిస్తున్నాయా? లేదా అనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. జూలై మధ్యలో ఈ సేవలు పున:ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని విశ్వసనీయ సమాచారం. దేశీయ విమాన సేవలు పరిమితంగా మొదలైన విషయం తెలిసిందే.