మూడు మతాలను కలిపిన.. వివాహం
దిశ ప్రతినిధి, ఖమ్మం: అబ్బాయి క్రిస్ట్రియన్… అమ్మాయి ముస్లిం.. పెళ్లి మాత్రం హిందు సాంప్రదాయం ప్రకారం జరిగింది. ఈ సంఘటన ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అన్నారుగూడెంలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన కొపిల అనిల్ ఖమ్మం పట్టణానికి సమీపంలో ఉన్న గొల్లగూడెం ప్రాంతానికి చెందిన షేక్ అజిత్ మియా-జాన్ బీ దంపతుల కూతురు సోని ఆదివారం వేదమంత్రాల సాక్షిగా ఒక్కటయ్యారు. హిందు ఆచార పద్ధతిలో వివాహం చేసుకుంటే ఇద్దరికి మంచి జరుగుతుందనే నమ్మకంతో ఇరు కుటుంబాల్లో […]
దిశ ప్రతినిధి, ఖమ్మం: అబ్బాయి క్రిస్ట్రియన్… అమ్మాయి ముస్లిం.. పెళ్లి మాత్రం హిందు సాంప్రదాయం ప్రకారం జరిగింది. ఈ సంఘటన ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అన్నారుగూడెంలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన కొపిల అనిల్ ఖమ్మం పట్టణానికి సమీపంలో ఉన్న గొల్లగూడెం ప్రాంతానికి చెందిన షేక్ అజిత్ మియా-జాన్ బీ దంపతుల కూతురు సోని ఆదివారం వేదమంత్రాల సాక్షిగా ఒక్కటయ్యారు. హిందు ఆచార పద్ధతిలో వివాహం చేసుకుంటే ఇద్దరికి మంచి జరుగుతుందనే నమ్మకంతో ఇరు కుటుంబాల్లో ఉండటంతోనే, ఇలా మూడు మతాలను కలిపిలా వివాహతంతు జరిగినట్టు బంధువులు తెలిపారు.