గచ్చిబౌలి ప్రమాదంపై షాకింగ్ నిజాలు.. అమ్మాయిల వల్లే ఇలా అంటూ..

దిశ, శేరిలింగంపల్లి : గచ్చిబౌలిలో శనివారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన సాయి సిద్దు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద ఘటనకు సంబంధించి పలు విషయాలు వెల్లడించారు. శుక్రవారం రాత్రి తమ రూములో సిట్టింగ్ వేశామని, ఎం. మానస (23), ఎస్. మానస (21), అబ్దుల్ రెహ్మాన్ (24)లు మద్యం సేవించారని, తాను తాగలేదని తెలిపాడు. మద్యం సేవించిన తరువాత టీ తాగేందుకు వెళ్దామని అమ్మాయిలు, రెహ్మాన్ ఒత్తిడి […]

Update: 2021-12-18 00:40 GMT

దిశ, శేరిలింగంపల్లి : గచ్చిబౌలిలో శనివారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన సాయి సిద్దు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద ఘటనకు సంబంధించి పలు విషయాలు వెల్లడించారు. శుక్రవారం రాత్రి తమ రూములో సిట్టింగ్ వేశామని, ఎం. మానస (23), ఎస్. మానస (21), అబ్దుల్ రెహ్మాన్ (24)లు మద్యం సేవించారని, తాను తాగలేదని తెలిపాడు. మద్యం సేవించిన తరువాత టీ తాగేందుకు వెళ్దామని అమ్మాయిలు, రెహ్మాన్ ఒత్తిడి చేశారని, అప్పటికే తాను వద్దని వారించిన వినలేదన్నారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటుందని ఈ సమయంలో బయటి వెళ్లడం మంచిది కాదని హెచ్చరించినట్టు పేర్కొన్నాడు. తన మాట వినకపోవడంతో సరే అని అందరం కలిసి బయలుదేరామన్నారు. ఈ క్రమంలో గచ్చిబౌలి హెచ్‌సీయూ డిపో వద్దకు చేరుకోగానే ఓవర్ స్పీడ్‌లో ఉన్న రెహ్మాన్ ఎల్లమ్మతల్లి టెంపుల్ ఎదురుగా ఉన్న చెట్టును ఢీ కొట్టాడని తెలిపారు. ఓవర్ స్పీడ్, మద్యం మత్తులోనే డ్రైవింగ్ చేయడంతోనే ఈ యాక్సిడెంట్ జరిగిందని, ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారని సిద్దు తెలిపాడు. ప్రమాదం జరిగిన కాసేపటికే అక్కడి చేరుకున్న పోలీసులు తనకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష చెయ్యగా జీరో వచ్చిందని వెల్లడించాడు.

Tags:    

Similar News