వృత్తి డ్యాన్స్ మాస్టర్.. ప్రవృత్తి దొంగతనం

దిశ, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కేంద్రంలో పగటి పూట దొంగతనాలు చేస్తున్న దొంగను పోలీసులు పట్టుకున్నారు. అనంతరం అతడిని రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన ఆనంద్ కుమార్(31) డ్యాన్స్ మాస్టర్‌గా పనిచేసేవాడు. ఈ నేపథ్యంలోనే జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు మొదలుపెట్టాడు. అయితే, సిద్దిపేట జిల్లాకు దొంగతనం చేసేందుకు వచ్చి ఓ లాడ్జీలో సేదతీరుతున్నాడు. ఇటీవల తమ ఇండ్లలో చోరీ జరిగిందని ఇద్దరు బాధితులు వన్‌టౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు […]

Update: 2020-08-07 07:54 GMT

దిశ, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కేంద్రంలో పగటి పూట దొంగతనాలు చేస్తున్న దొంగను పోలీసులు పట్టుకున్నారు. అనంతరం అతడిని రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన ఆనంద్ కుమార్(31) డ్యాన్స్ మాస్టర్‌గా పనిచేసేవాడు. ఈ నేపథ్యంలోనే జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు మొదలుపెట్టాడు.

అయితే, సిద్దిపేట జిల్లాకు దొంగతనం చేసేందుకు వచ్చి ఓ లాడ్జీలో సేదతీరుతున్నాడు. ఇటీవల తమ ఇండ్లలో చోరీ జరిగిందని ఇద్దరు బాధితులు వన్‌టౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలోనే అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులపై నిఘా వేశారు.

కాగా, జిల్లా కేంద్రంలోని సందీప్ లాడ్జీలో తనిఖీలు చేస్తుండగా.. ఆనంద్ పోలీసుల కంటపడ్డాడు. అతడి వద్ద నున్న బ్యాగులో బంగారం ఉన్నట్టు గుర్తించిన పోలీసులు స్టేషన్‌కి తీసుకెళ్లి విచారించగా.. దొంగతనం చేసింది తానే అని ఒప్పుకున్నాడు. నిందితుడి నుంచి 6.1/2 తులాల బంగారం, రూ. 10 వేల నగదు, 17 తులాల వెండి స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా ఆనంద్ పై దొంగతనం కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News