ఏపీలో ఇంటర్ పరీక్షలు అప్పుడే.. సుప్రీంలో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. పరీక్షల నిర్వహణలో వెనక్కితగ్గేది లేదని తేల్చి చెప్పింది. అయితే జూలై మెుదటి వారంలో కాకుండా చివరి వారంలో ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని అఫిడవిట్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే పరీక్షల నిర్వహణలో కొవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తామని తెలిపింది. ఇకపోతే మంగళవారం ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పరీక్షల నిర్వహణకు సంబంధించి అఫిడవిట్ దాఖలు […]

Update: 2021-06-23 07:44 GMT

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. పరీక్షల నిర్వహణలో వెనక్కితగ్గేది లేదని తేల్చి చెప్పింది. అయితే జూలై మెుదటి వారంలో కాకుండా చివరి వారంలో ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని అఫిడవిట్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే పరీక్షల నిర్వహణలో కొవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తామని తెలిపింది. ఇకపోతే మంగళవారం ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

పరీక్షల నిర్వహణకు సంబంధించి అఫిడవిట్ దాఖలు చేయకపోవడంపై మండిపడింది. పరీక్షల నిర్వహణకు సంబంధించి వివరాలను గురువారంలోపు అఫిడవిట్‌లో పొందుపరచాలని ఆదేశించింది. అదే సమయంలో ఒక్క విద్యార్థి ప్రాణంపోయినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని సుప్రీంకోర్టు హెచ్చరించిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాలతో బుధవారం ఏపీ విద్యాశాఖ సెక్రటరీ అఫిడవిట్ దాఖలు చేశారు.

Tags:    

Similar News