బిగ్ బ్రేకింగ్.. ఏపీలో ఇంటర్ ఎగ్జామ్స్ వాయిదా

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా ప్రతాపం క్రమంలో ఎట్టకేలకు ఇంటర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. కరోనా నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంటర్ పరీక్షలను వాయిదా వేయాలని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎట్టకేలకు ప్రభుత్వం వెనక్కి తగ్గి పరీక్షలను వాయిదా వేసింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్‌మీడియట్‌ పరీక్షల నిర్వహణమీద పునరాలోచన చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు […]

Update: 2021-05-02 06:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా ప్రతాపం క్రమంలో ఎట్టకేలకు ఇంటర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. కరోనా నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంటర్ పరీక్షలను వాయిదా వేయాలని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎట్టకేలకు ప్రభుత్వం వెనక్కి తగ్గి పరీక్షలను వాయిదా వేసింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇంటర్‌మీడియట్‌ పరీక్షల నిర్వహణమీద పునరాలోచన చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని, న్యాయస్థానం అభిప్రాయాన్ని గౌరవిస్తూ పరీక్షలను వాయిదా వేస్తున్నాం’ అని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటన విడుదల చేశారు.

Tags:    

Similar News