ఈనెల 12 నుంచి ఇంటర్ తరగతులు ప్రారంభం
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో ఈనెల 12 నుంచి ఇంటర్ కళాశాలలు ప్రారంభం కానున్నట్లు విద్యాశాఖ స్పష్టం చేసింది. ఇంటర్ సెకండియర్‌కు సంబంధించి 213 రోజుల అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. జూలై 12న కళాశాలల ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు, ఇతర సిబ్బంది అంతా విధులకు హాజరుకావాలని విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. అదే రోజు నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాస్‌లు ప్రారంభించాలని నిర్దేశించింది. ఈ నెల 12 నుంచి వచ్చే ఏడాది మార్చి 23 […]
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో ఈనెల 12 నుంచి ఇంటర్ కళాశాలలు ప్రారంభం కానున్నట్లు విద్యాశాఖ స్పష్టం చేసింది. ఇంటర్ సెకండియర్‌కు సంబంధించి 213 రోజుల అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. జూలై 12న కళాశాలల ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు, ఇతర సిబ్బంది అంతా విధులకు హాజరుకావాలని విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. అదే రోజు నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాస్‌లు ప్రారంభించాలని నిర్దేశించింది. ఈ నెల 12 నుంచి వచ్చే ఏడాది మార్చి 23 వరకు క్లాసులు జరుగుతాయని తెలిపింది. అక్టోబరు 1 నుంచి 8 వరకు అర్ధ సంవత్సర పరీక్షలు, అలాగే యూనిట్ టెస్ట్‌లు కూడా నిర్వహించనున్నట్లు విద్యాశాఖ తెలిపింది.