ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ రిలీజ్
దిశ, తెలంగాణ బ్యూరో: మార్చి 23 నుంచి ఏప్రెల్ 12 వరకు ఈ ఏడాది ఇంటర్ పరీక్షలను నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 15 వరకు ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహిస్తారు. ప్రిఫైనల్ పరీక్షలను ఫిబ్రవరి 2 నుంచి 18 వరకు నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఇంటర్ అకాడమిక్ కాలెండర్ ను ఇంటర్ బోర్డ్ విడుదల చేసింది. జులై 1 నుంచి ఏప్రెల్ 13 వరకు ఆన్ లైన్ క్లాసులు 47, ఫిజికల్ క్లాసులు 173 రోజులను […]
దిశ, తెలంగాణ బ్యూరో: మార్చి 23 నుంచి ఏప్రెల్ 12 వరకు ఈ ఏడాది ఇంటర్ పరీక్షలను నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 15 వరకు ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహిస్తారు. ప్రిఫైనల్ పరీక్షలను ఫిబ్రవరి 2 నుంచి 18 వరకు నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఇంటర్ అకాడమిక్ కాలెండర్ ను ఇంటర్ బోర్డ్ విడుదల చేసింది. జులై 1 నుంచి ఏప్రెల్ 13 వరకు ఆన్ లైన్ క్లాసులు 47, ఫిజికల్ క్లాసులు 173 రోజులను కలిపి 220 పనిదినాలను కేటాయించారు. అన్ని రకాల సెలవులను 67 రోజుల పాటు ప్రకటించగా వీటిలో దసరాకు అక్టోబర్ 13 నుంచి 16 వరకు 4 రోజులు, సంక్రాంతికి జనవరి 13 నుంచి 15 వరకు వరకు 3 రోజుల పాటు సెలవులను ప్రకటించారు. ఏప్రెల్ 13న చివరి వర్కిండే నిర్వహించి ఏప్రెల్ 14 నుంచి మే 05 వరకు వేసవి సెలవులను ప్రకటించారు.
అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను మే చివరి వారంలో చేపట్టనున్నారు. వచ్చే ఏడాది జూన్ 1 నుంచి కళాశాలను పున:ప్రారంభించనున్నారు. ప్రభుత్వం ప్రకటించిన సెలవు దినాల్లో తరగతులను నిర్వహిస్తే కళాశాల యాజమాన్యాలపై కఠిన చర్యలు చేపడుతామని ఇంటర్ బోర్డ్ సెక్రటరీ సయ్యద్ ఒమర్ జలీల్ హెచ్చరించారు. ఇంటర్ బోర్డ్ నిర్ణయించిన తేదీలోపే అడ్మిషన్ల ప్రక్రియ ముగించాలని సూచించారు. పీఆర్ఓలను ఏర్పాటు చేసుకొని విద్యార్థుల అడ్మిషన్ కోసం మార్కెంటింగ్ చేయకూడదని, కళాశాలలకు సంబంధించిన పాంప్లిమెంట్ లు, హోర్డింగ్ లు ఏర్పాటు చేయవద్దని, మీడియా ద్వారా ప్రకటనలు జారీ చేయకూడదని నిబంధనలు విధించారు. ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు చట్ట విరుద్ధ కార్యక్రమాలను పాల్పడినట్టు తెలిస్తే కఠిన చర్యలు చేపడుతామని హెచ్చరించారు.