ఇక నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో అమ్మకాలు!
వచ్చే నెల నుంచి ఇన్‌స్టాగ్రామ్ తమ క్రియేటర్లకు నేరుగా యాప్‌లోనే ఉత్పత్తులను అమ్ముకునే అవకాశం కల్పించబోతోంది. దీనికి సంబంధించి కామర్స్ ఎలిజబిలిటీ అవసరాలను కూడా ఇప్పటికే ప్రకటించింది. కరోనా సమయంలో ఎవరూ షాపింగ్ చేయడానికి స్టోర్‌కు వెళ్లలేక పోయిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఇన్‌స్టాగ్రామ్ అమ్మకాల వల్ల క్రియేటర్లు తమ ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో ఎక్కువగా అమ్ముకునే అవకాశం కలగనుంది. ఇన్‌స్టాగ్రామ్ షాపింగ్‌కు అనుమతి ఉన్న అన్ని దేశాల్లోనూ ఈ ఫీచర్ జులై 9 నుంచి అందుబాటులోకి […]
వచ్చే నెల నుంచి ఇన్‌స్టాగ్రామ్ తమ క్రియేటర్లకు నేరుగా యాప్‌లోనే ఉత్పత్తులను అమ్ముకునే అవకాశం కల్పించబోతోంది. దీనికి సంబంధించి కామర్స్ ఎలిజబిలిటీ అవసరాలను కూడా ఇప్పటికే ప్రకటించింది. కరోనా సమయంలో ఎవరూ షాపింగ్ చేయడానికి స్టోర్‌కు వెళ్లలేక పోయిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఇన్‌స్టాగ్రామ్ అమ్మకాల వల్ల క్రియేటర్లు తమ ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో ఎక్కువగా అమ్ముకునే అవకాశం కలగనుంది. ఇన్‌స్టాగ్రామ్ షాపింగ్‌కు అనుమతి ఉన్న అన్ని దేశాల్లోనూ ఈ ఫీచర్ జులై 9 నుంచి అందుబాటులోకి రానుంది.
ఇన్‌స్టాగ్రామ్ షాపింగ్‌లో ఉత్పత్తులను అమ్ముకునేందుకు ముందుగా క్రియేటర్లు తమ విశ్వసనీయతను చూపించుకోవాలి. అయితే ఇందులో ఫాలోవర్ల సంఖ్యను కూడా ఇన్‌స్టాగ్రామ్ పరిగణనలోకి తీసుకుబోతున్నట్లు సమాచారం. ఎంతమంది ఫాలోవర్లు అనే విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు. కేవలం ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రమే కాకుండా వారి సొంత వెబ్‌సైట్ నుంచి కూడా క్రియేటర్లు ఉత్పత్తులను ట్యాగ్ చేసుకోవచ్చు. కొన్నేళ్లుగా ఇలా షాపింగ్ ఫీచర్ తీసుకురావాలని ఇన్‌స్టాగ్రామ్ ప్రయత్నిస్తుండగా.. మొదట 2016లో షాపింగ్ ట్యాగ్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. తర్వాత 2018లో స్టోరీలలో షాపింగ్ ఫీచర్ తీసుకొచ్చింది. అయితే దీన్ని సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లకే పరిమితం చేసింది.