అమరావతి భూముల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరగలేదు : సుప్రీంకోర్టు

దిశ, ఏపీ బ్యూరో: అమరావతి భూముల కొనుగోలు కేసుపై సుప్రీంకోర్టు పూర్తి స్థాయి తీర్పును విడుదల చేసింది. అమరావతి భూముల కొనుగోలులో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరుగలేదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును న్యాయమూర్తులు వినీత్ శరన్, దినేష్ మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం సమర్థించింది. హైకోర్టు అన్నీ పరిశీలించిన తర్వాతనే ఎఫ్ఐఆర్‌లను కొట్టివేసిందని తీర్పులో పేర్కొంది. ఈ కేసులో హైకోర్టు ఎక్కడా చట్ట విరుద్ధంగా ప్రవర్తించలేదని తెలిపింది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకునే ఎఫ్ఐఆర్‌లను కొట్టేసిందని తెలిపింది. రాజధాని ఎక్కడ […]

Update: 2021-07-20 10:37 GMT

దిశ, ఏపీ బ్యూరో: అమరావతి భూముల కొనుగోలు కేసుపై సుప్రీంకోర్టు పూర్తి స్థాయి తీర్పును విడుదల చేసింది. అమరావతి భూముల కొనుగోలులో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరుగలేదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును న్యాయమూర్తులు వినీత్ శరన్, దినేష్ మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం సమర్థించింది. హైకోర్టు అన్నీ పరిశీలించిన తర్వాతనే ఎఫ్ఐఆర్‌లను కొట్టివేసిందని తీర్పులో పేర్కొంది. ఈ కేసులో హైకోర్టు ఎక్కడా చట్ట విరుద్ధంగా ప్రవర్తించలేదని తెలిపింది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకునే ఎఫ్ఐఆర్‌లను కొట్టేసిందని తెలిపింది.

రాజధాని ఎక్కడ అన్నది రహస్యమేమీ కాదని, అది అందరికీ తెలిసిన విషయమేనని సుప్రీంకోర్టు తీర్పులో వెల్లడించింది. పబ్లిక్ డొమైన్‌లో ఎప్పటి నుంచో ఉందని స్పష్టం చేసింది. భూములు అమ్మిన వారికి నష్టం వాటిల్లిందని చెప్పడానికి ఆధారాలు లేవని.. అలాగే కొనుగోలుదారులు మోసం చేశారన్న వాదనలకు కూడా తావులేదని పేర్కొంది. అమ్మకందారుల ప్రయోజనాలు కాపాడేందుకు కొనుగోలుదారులతో వారికి న్యాయపరమైన సంబంధమేమీ లేదని తెలిపింది.

ప్రైవేటు వ్యక్తుల మధ్య జరిగిన ఒప్పందాలు కావడంతో అవినీతి నిరోధక చట్టం కింద ప్రభుత్వాధికారులపై కేసులు పెట్టే వీలు లేదని అభిప్రాయపడింది. దర్యాప్తును ప్రాథమిక స్థాయిలోనే అడ్డుకునే పరిధి హైకోర్టుకు లేదన్న ఏపీ ప్రభుత్వ వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

Tags:    

Similar News