సీఎం జగన్ బెయిల్ రద్దు కేసులో కీలక పరిణామం

దిశ, ఏపీ బ్యూరో: సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు అంశంపై విచారణ మరోసారి వాయిదా పడింది. అక్రమాస్తుల కేసులో బెయిల్ రద్దు చేయాలంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సోమవారం సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఎంపీ ర‌ఘురామ, వైఎస్ జ‌గ‌న్‌ లిఖిత పూర్వకంగా త‌మ‌ వాద‌న‌లు స‌మ‌ర్పించారు. అయితే తాము కూడా లిఖిత పూర్వకంగా వాదనలు సమర్పిస్తామని సీబీఐ కోర్టుకు […]

Update: 2021-07-26 02:43 GMT

దిశ, ఏపీ బ్యూరో: సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు అంశంపై విచారణ మరోసారి వాయిదా పడింది. అక్రమాస్తుల కేసులో బెయిల్ రద్దు చేయాలంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సోమవారం సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఎంపీ ర‌ఘురామ, వైఎస్ జ‌గ‌న్‌ లిఖిత పూర్వకంగా త‌మ‌ వాద‌న‌లు స‌మ‌ర్పించారు. అయితే తాము కూడా లిఖిత పూర్వకంగా వాదనలు సమర్పిస్తామని సీబీఐ కోర్టుకు తెలిపింది. దీంతో విచార‌ణ‌ను ఈ నెల 30కి వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. అక్రమాస్తుల కేసులో సీఎం జగన్ ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. అయితే జగన్ బెయిల్ నిబంధనలను ఉల్లంఘించారంటూ ఎంపీ రఘురామ ఆరోపిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. దాంతో పాటు రిజాయిండర్ కూడా వేసిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News