రాష్ట్రంలో దళితుల పట్ల అన్యాయం..!

దిశ, వెబ్‎డెస్క్: రాష్ట్రంలోని పలు ఘటనల్లో అగ్రకూలాల వారిపై కేసులు ఎత్తివేశారని.. దళితులపై ఉన్న ఒక్క కేసు కూడా ఎత్తివేయలేదని మాజీ ఎంపీ హర్షకుమార్ విమర్శించారు. దళితులపై జరుగుతున్న దాడులపై విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ హర్షకుమార్ మాట్లాడుతూ.. చీరాలకు చెందిన కిరణ్ కేసును విచారణ వచ్చే సమయానికి ఉపసంహరించుకున్నారని.. దీంతో ఆ కేసులో తానే పిల్ వేయాల్సి వచ్చిందని అన్నారు. రాష్ట్రంలో దళితుల దాడుల కేసుల్లో న్యాయం జరగడం లేదని […]

Update: 2020-09-26 05:51 GMT

దిశ, వెబ్‎డెస్క్: రాష్ట్రంలోని పలు ఘటనల్లో అగ్రకూలాల వారిపై కేసులు ఎత్తివేశారని.. దళితులపై ఉన్న ఒక్క కేసు కూడా ఎత్తివేయలేదని మాజీ ఎంపీ హర్షకుమార్ విమర్శించారు. దళితులపై జరుగుతున్న దాడులపై విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాజీ ఎంపీ హర్షకుమార్ మాట్లాడుతూ.. చీరాలకు చెందిన కిరణ్ కేసును విచారణ వచ్చే సమయానికి ఉపసంహరించుకున్నారని.. దీంతో ఆ కేసులో తానే పిల్ వేయాల్సి వచ్చిందని అన్నారు. రాష్ట్రంలో దళితుల దాడుల కేసుల్లో న్యాయం జరగడం లేదని ఎద్దేవా చేశారు. అనపర్తిలో అంబేద్కర్ విగ్రహం పెట్టినందుకు జైల్లో వేశారని విమర్శించారు. రిలయన్స్ మాల్స్‎పై దాడులు, ముస్లిం యువతపై పెట్టిన కేసులు ఎత్తివేశారని ఆరోపించారు.

Tags:    

Similar News