ఏకకాలంలో ఒక్కరికే రెండు వేరియంట్ల ఇన్ఫెక్షన్
న్యూఢిల్లీ: ఓ బెల్జియన్ వృద్ధురాలి(90)కి ఆల్ఫా, బీటా రెండు వేరియంట్లూ ఏకకాలంలో సోకాయి. ఇద్దరు వేర్వేరు వ్యక్తుల నుంచి ఈ వేరియంట్లు సోకి ఉండవచ్చని వైద్యులు భావిస్తున్నారు. సాధారణ జ్వరంతో తొలుత ఆస్పత్రిలో చేరినప్పటికీ ఐదు రోజుల్లో ఆమె ఆరోగ్యం దారుణంగా క్షీణించి మరణించారు. ఈ ఘటన బెల్జియంలో మార్చిలో జరిగింది. రెండు వేరియంట్లు ఏకకాలంలో ఒకరికి సోకడం బహుశా అదే తొలి కేసుగా వైద్యులు చెప్పారు. యూకేలో కనిపించిన తొలి వేరియంట్‌నే ఆల్ఫాగా, దక్షిణాఫ్రికాలో కనిపించిన […]
న్యూఢిల్లీ: ఓ బెల్జియన్ వృద్ధురాలి(90)కి ఆల్ఫా, బీటా రెండు వేరియంట్లూ ఏకకాలంలో సోకాయి. ఇద్దరు వేర్వేరు వ్యక్తుల నుంచి ఈ వేరియంట్లు సోకి ఉండవచ్చని వైద్యులు భావిస్తున్నారు. సాధారణ జ్వరంతో తొలుత ఆస్పత్రిలో చేరినప్పటికీ ఐదు రోజుల్లో ఆమె ఆరోగ్యం దారుణంగా క్షీణించి మరణించారు. ఈ ఘటన బెల్జియంలో మార్చిలో జరిగింది. రెండు వేరియంట్లు ఏకకాలంలో ఒకరికి సోకడం బహుశా అదే తొలి కేసుగా వైద్యులు చెప్పారు. యూకేలో కనిపించిన తొలి వేరియంట్‌నే ఆల్ఫాగా, దక్షిణాఫ్రికాలో కనిపించిన తొలి వేరియంట్‌ను బీటాగా వ్యవహరిస్తున్నాం.
యూరోపియన్ కాంగ్రెస్ ఆన్ క్లినికల్ మైక్రోబయాలజీ ఇన్ఫెక్షియస్ డిసీసెస్‌లో ఈ కేసు గురించి చర్చించారు. కానీ, ఈ కేసుపై తగినస్థాయిలో పరిశోధనలు జరగలేదు. పరిశోధనాపత్రాలు రాలేవు. జనవరిలోనే బ్రెజిల్‌లో ఇద్దరికి రెండు వేరియంట్లు సోకిన కేసులున్నప్పటికీ అవి రెండూ ఆందోళనకారక వేరియంట్లు కావు. బెల్జియం కేసులో మాత్రం రెండు వేరియంట్లు ఆందోళనకరమైనవే. అయితే, ఆమె మరణానికి ఈ రెండు వేరియంట్లు ప్రభావం ఏమిటన్నదానిపై ఇంకా స్పష్టత లేదని అధికారులు పేర్కొన్నారు.