యాదాద్రిలో 190 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్

దిశ, న్యూస్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి భువనగిరి జిల్లాలో మరో బృహత్కర కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. యాదరిగుట్ట మండలం దత్తార్పల్లి సమీపంలో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందుకోసం టీఎస్ ఐఐసీ బృందం కసరత్తులు చేస్తోంది. 190 ఎకరాలలో నూతనంగా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుపై ప్రతిపాదిత అసైన్డ్ భూముల కేటాయింపుపై టీఎస్ ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు శుక్రవారం భువనగిరిలో సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత భూములను పరిశీలించారు. ఈ సమీక్షలో […]

Update: 2020-06-05 06:55 GMT

దిశ, న్యూస్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి భువనగిరి జిల్లాలో మరో బృహత్కర కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. యాదరిగుట్ట మండలం దత్తార్పల్లి సమీపంలో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందుకోసం టీఎస్ ఐఐసీ బృందం కసరత్తులు చేస్తోంది. 190 ఎకరాలలో నూతనంగా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుపై ప్రతిపాదిత అసైన్డ్ భూముల కేటాయింపుపై టీఎస్ ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు శుక్రవారం భువనగిరిలో సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత భూములను పరిశీలించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే సునీతా మహేందర్ రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News