మేలు జరుగుతోంది: ఇంద్రకరణ్ రెడ్డి
దిశ, ఆదిలాబాద్: చెక్ డ్యామ్ లతో రైతులకు మరింత మేలు కలుగుతుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం మలక్ చించోలి గ్రామ సమీపంలో స్వర్ణ నది పైన రూ.4 కోట్ల తో నిర్మించనున్న చెక్ డ్యామ్ పనులకు శనివారం ఆయన భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో వాగుల నీళ్లు వృధాగా గోదావరిలో కలిసిపోయాయన్నారు. 12 చెక్ డ్యామ్ ల నిర్మాణం కోసం ప్రతిపాదనలు […]
దిశ, ఆదిలాబాద్: చెక్ డ్యామ్ లతో రైతులకు మరింత మేలు కలుగుతుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం మలక్ చించోలి గ్రామ సమీపంలో స్వర్ణ నది పైన రూ.4 కోట్ల తో నిర్మించనున్న చెక్ డ్యామ్ పనులకు శనివారం ఆయన భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో వాగుల నీళ్లు వృధాగా గోదావరిలో కలిసిపోయాయన్నారు. 12 చెక్ డ్యామ్ ల నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపగా ఇప్పటికే ఆరు మంజూరయ్యాయని చెప్పారు. వీటిలో మూడు నిర్మాణాలు ఇప్పటికే పూర్తికాగా… మరో మూడు నిర్మాణాలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. మంత్రి వెంట జిల్లా పరిషత్ చైర్మన్ విజయలక్ష్మి, నాయకులు రాజేశ్వర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, సత్యనారాయణ గౌడ్, రామ్ కిషన్ రెడ్డి ఎర్ర బోతు రాజేందర్ ఉన్నారు.