కొత్తగా గ్రీన్ ఫంగస్.. మొదటి కేసు ఎక్కడంటే..?
దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి నుండి ఇప్పుడిప్పుడే అన్ని దేశాలు కోలుకొంటున్నాయి. కానీ, ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవకుండానే కొత్త ఫంగస్ లు ప్రజలపై దాడి చేస్తున్నాయి. ఇప్పటీకే బ్లాక్ , వైట్, ఎల్లో ఫంగస్ కేసులను గుర్తించిన వైద్యులు తాజాగా గ్రీన్ ఫంగస్ ను కూడా గుర్తించారు. మధ్యప్రదేశ్ లో ఓ వ్యక్తికి గ్రీన్ ఫంగస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. ఇండోర్‌లోని శ్రీ అరబింద్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆస్పత్రిలో ఈ ఫంగస్ […]
దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి నుండి ఇప్పుడిప్పుడే అన్ని దేశాలు కోలుకొంటున్నాయి. కానీ, ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవకుండానే కొత్త ఫంగస్ లు ప్రజలపై దాడి చేస్తున్నాయి. ఇప్పటీకే బ్లాక్ , వైట్, ఎల్లో ఫంగస్ కేసులను గుర్తించిన వైద్యులు తాజాగా గ్రీన్ ఫంగస్ ను కూడా గుర్తించారు. మధ్యప్రదేశ్ లో ఓ వ్యక్తికి గ్రీన్ ఫంగస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. ఇండోర్‌లోని శ్రీ అరబింద్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆస్పత్రిలో ఈ ఫంగస్ ఇన్‌ఫెక్షన్‌ను ఛాతీ వ్యాధుల విభాగాధిపతి డాక్టర్ రవి దోసి గుర్తించారు. ఇటీవలే కోవిడ్ నుంచి కోలుకున్న ఓ వ్యక్తికి గ్రీన్ ఫంగస్ ఇన్‌ఫెక్షన్ సోకిందని ఆయన వివరించారు.
ఇటీవల 35 ఏళ్ల ఓ వ్యక్తి కరోనా నుండి కోలుకున్నాడు. ఆ తర్వాత కూడా అతనికి ముక్కు నుండి రక్తం కారడం, రోజు జ్వరం రావడంతో బ్లాక్ ఫంగస్ సోకిందేమోనని డాక్టర్లు అనుకున్నారు. పరీక్షలు చేయగా ఊపిరితిత్తుల్లో గ్రీన్ ఫంగస్ ఉన్నట్లు తేలిందని వైద్యులు తెలిపారు. దీంతో ఆయన ఊపిరితిత్తులు, రక్తం, సైనస్ ల మీద ప్రభావం పడినట్లు తెలిపారు. గ్రీన్ ఫంగస్.. ఒకరమైన ఆస్పెర్‌గిలోసిస్ ఇన్‌ఫెక్షన్ అని, కరోనా లాగే ఇది కూడా ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుందని , మనుషుల్లో చాలా అరుదుగా ఇలాంటి ఇన్‌ఫెక్షన్ వస్తుందని డాక్టర్లు తెలిపారు. కాగా, బాధితుడిని చికిత్స నిమిత్తం ఎయిర్ అంబులెన్సు ద్వారా ముంబైకి తరలించారు.
Possibly the first patient detected with Green fungus, in Indore and shifted to Mumbai by air ambulance for treatment. He recovered from COVID-19 recently but underwent a test on suspicion that he had contracted black fungus! pic.twitter.com/Anys2ciXab
— Anurag Dwary (@Anurag_Dwary) June 15, 2021