భారీగా పెరిగిన దేశీయ ఎగుమతులు

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఎగుమతులు భారీగా పెరిగాయి. చైనాతో పాటు ఇతర ఆసియా దేశాలకు జులై నెలలో ఎగుమతులు 78 శాతం పెరిగినట్టు క్రిసిల్ నివేదిక వెల్లడించింది. ఇది మొత్తం ఎగుమతుల్లో 16 శాతానికి సమానం. ఇక, ఏప్రిల్ నెలల్లో ఎగుమతులు 60.2 శాతం, మేలో 50 శాతం, జూన్‌లో 30 శాతం క్షీణించిన సంగతి తెలిసిందే. కానీ, జులై నాటికి ఎగుమతులు 10.2 శాతానికి పరిమితమవడం గమనార్హమని క్రిసిల్ నివేదిక తెలిపింది. జులైలో చైనాకు 78 శాతం, […]

Update: 2020-08-23 05:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఎగుమతులు భారీగా పెరిగాయి. చైనాతో పాటు ఇతర ఆసియా దేశాలకు జులై నెలలో ఎగుమతులు 78 శాతం పెరిగినట్టు క్రిసిల్ నివేదిక వెల్లడించింది. ఇది మొత్తం ఎగుమతుల్లో 16 శాతానికి సమానం. ఇక, ఏప్రిల్ నెలల్లో ఎగుమతులు 60.2 శాతం, మేలో 50 శాతం, జూన్‌లో 30 శాతం క్షీణించిన సంగతి తెలిసిందే. కానీ, జులై నాటికి ఎగుమతులు 10.2 శాతానికి పరిమితమవడం గమనార్హమని క్రిసిల్ నివేదిక తెలిపింది.

జులైలో చైనాకు 78 శాతం, మలేషియాకు 76 శాతం, వియత్నాంకు 43 శాతం, సింగపూర్‌కు 37 శాతం చొప్పున ఎగుమతులు పెరిగాయి. అలాగే, యూఏఈకి 53.2 శాతం, బ్రిటన్‌కు 38.8 శాతం, యూఎస్‌కు 11.2 శాతం, బ్రెజిల్‌కు 3.3 శాతం మేర తగ్గినట్టు నివేదిక వివరించింది. కొవిడ్-19ను అదుపులో పెట్టిన దేశాలకు మాత్రమే ఎగుమతులు పెరిగాయని నివేదిక తెలిపింది.

Tags:    

Similar News