ముదురుతున్న మహమ్మారి.. పెరుగుతున్న కేసులు
దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా రెండో దశ ప్రారంభమైందా..? దేశంలో గడిచిన నాలుగు రోజులుగా నమోదవుతున్న కేసుల సంఖ్యను చూస్తే ఈ అనుమానం రాకమానదు. మహారాష్ట్రలో ఇప్పటికే కరోనా సెకండ్ స్టేజ్ మొదలైందని ఇటీవలే కేంద్ర ప్రభుత్వం హెచ్చరించగా.. కొద్దిరోజులుగా మధ్యప్రదేశ్, పంజాబ్, కేరళ, గుజరాత్, కర్నాటకలలో కూడా కొవిడ్-19 కేసులు ఎక్కువవుతండటం ఆందోళన కలిగిస్తున్నది. గడిచిన 24 గంటల్లో (గురువారం ఉదయం 10 గంటల నాటికి) దేశంలో 35,871 కొత్త కేసులు నమోదుకావడం గమనార్హం. గడిచిన […]
దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా రెండో దశ ప్రారంభమైందా..? దేశంలో గడిచిన నాలుగు రోజులుగా నమోదవుతున్న కేసుల సంఖ్యను చూస్తే ఈ అనుమానం రాకమానదు. మహారాష్ట్రలో ఇప్పటికే కరోనా సెకండ్ స్టేజ్ మొదలైందని ఇటీవలే కేంద్ర ప్రభుత్వం హెచ్చరించగా.. కొద్దిరోజులుగా మధ్యప్రదేశ్, పంజాబ్, కేరళ, గుజరాత్, కర్నాటకలలో కూడా కొవిడ్-19 కేసులు ఎక్కువవుతండటం ఆందోళన కలిగిస్తున్నది. గడిచిన 24 గంటల్లో (గురువారం ఉదయం 10 గంటల నాటికి) దేశంలో 35,871 కొత్త కేసులు నమోదుకావడం గమనార్హం. గడిచిన మూడునెలలుగా.. అంటే 2020 డిసెంబర్ నుంచి ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం.
దేశంలో గడిచిన నాలుగు రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య చూస్తే.. రోజుకు సుమారు మూడు వేల చొప్పున పెరుతున్నాయి. ఇక బుధవారం 28,903 కేసులు రాగా.. గురువారం అవి ఏకంగా ఏడు వేలకు పెరిగి 35,871 గా నమోదుకావడం ఆందోళనకు గురి చేస్తున్నది. ఇక మహారాష్ట్రలో బుధవారం వెల్లడైన గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో 23,179 కేసులు వచ్చాయి. కేసుల పెరుగుదల నేపథ్యంలో రాష్ట్రంలో వ్యాక్సిన్ల ప్రక్రియను వేగవంతం చేసింది అక్కడి సర్కారు. బుధవారం ఒక్కరోజే 2,74,037 మందికి కరోనా వ్యాక్సిన్ వేశారు. ఇప్పటివరకు మొత్తంగా 36 లక్షల మందికి పైగా టీకాలు వేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
కొవిడ్-19 కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండటంతో రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. మహారాష్ట్రలో పలు చోట్ల లాక్‌డౌన్ విధించగా.. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్నాటకలో కరోనా కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో ఆంక్షలు విధించాయి అక్కడి ప్రభుత్వాలు. కొత్త కేసులు నమోదవుతున్న ప్రాంతాలలో రాత్రి పూట ఆంక్షలు విధిస్తూ మహమ్మారి కట్టడికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.