స్మోకింగ్ మానేయడం భారతీయులకు కష్టమే
దిశ, ఫీచర్స్ : కాలేజ్ డేస్‌లో ఫ్రెండ్స్‌తో సరదాగా మొదలయ్యే స్మోకింగ్ హ్యాబిట్.. ఆ తర్వాత వ్యసనంలా మారిపోతుంది. ఈ దురలవాటును వదిలించుకునేందుకు ఎంతగా ప్రయత్నించినా.. ఏదో బలహీన క్షణాన నియంత్రణ కోల్పోయి మళ్లీ మొదలెట్టేస్తుంటారు. అయితే దీని వల్ల కలిగే దుష్ర్పభావాలపై అవేర్‌నెస్ కార్యక్రమాలు రూపొందిస్తున్నా.. స్మోకింగ్ హ్యాబిట్ తగ్గుదల రేటు కొన్ని దేశాల్లో అత్యల్పంగా ఉంటుంది. ఇందులో భారత్ కూడా ఒకటి కాగా.. 16 – 64 ఏళ్ల మధ్య వయసు గల పొగాకు […]
దిశ, ఫీచర్స్ : కాలేజ్ డేస్‌లో ఫ్రెండ్స్‌తో సరదాగా మొదలయ్యే స్మోకింగ్ హ్యాబిట్.. ఆ తర్వాత వ్యసనంలా మారిపోతుంది. ఈ దురలవాటును వదిలించుకునేందుకు ఎంతగా ప్రయత్నించినా.. ఏదో బలహీన క్షణాన నియంత్రణ కోల్పోయి మళ్లీ మొదలెట్టేస్తుంటారు. అయితే దీని వల్ల కలిగే దుష్ర్పభావాలపై అవేర్‌నెస్ కార్యక్రమాలు రూపొందిస్తున్నా.. స్మోకింగ్ హ్యాబిట్ తగ్గుదల రేటు కొన్ని దేశాల్లో అత్యల్పంగా ఉంటుంది. ఇందులో భారత్ కూడా ఒకటి కాగా.. 16 – 64 ఏళ్ల మధ్య వయసు గల పొగాకు వినియోగదారుల్లో ఇండియా రెండో స్థానంలో ఉంది.
ప్రపంచ బ్యాంక్ నుంచి అందిన సెకండరీ డేటాను ఉపయోగించి ‘ది ఇంటర్నేషనల్ కమిషన్ టు రా ఇగ్నైట్ ది ఫైట్ ఎగైనెస్ట్ స్మోకింగ్’ రూపొందించిన నివేదిక ప్రకారం.. చైనా, భారత్‌లో పైన తెలిపిన ఏజ్ గ్రూప్ స్మోకర్స్ 500 మిలియన్లకు పైగా ఉన్నారు. ఈ జాబితాలో 2,50,002,133 మందితో ఇండియా రెండో స్థానంలో ఉంది. పొగాకు ప్రాబల్యం మహిళల కంటే పురుషుల్లో మూడు రెట్లు అధికంగా ఉండగా.. ప్రపంచంలో పొగరహిత పొగాకు వినియోగం, నోటి క్యాన్సర్‌కు సంబంధించిన అత్యధిక నిష్పత్తులు కూడా భారతదేశంలోనే ఉన్నాయని సదరు నివేదిక పేర్కొంది.
స్మోకింగ్ వదిలేయడంలో వెనుకంజ..
ధూమపానం చేసే భారతీయుల్లో 37 శాతం మంది ఈ అలవాటును ప్రణాళికాబద్ధంగా మానేయాలనే కోరికను వెలిబుచ్చినట్లు నివేదిక పేర్కొంది. అయితే పురుషుల్లో ఈ భావన 20 శాతం కంటే తక్కువగా ఉందని తెలిపింది. ఇక ప్రపంచవ్యాప్తంగా 1.14 బిలియన్ ప్రజలు పొగాకు వినియోగిస్తున్నట్లు అంచనా కాగా.. ఈ ప్రభావం వల్ల ఏటా దాదాపు ఎనిమిది మిలియన్ సంఖ్యలో మరణిస్తున్నారని, 200 మిలియన్ స్మోకర్స్ వైకల్యం బారిన పడి జీవితాలను కొనసాగిస్తున్నారని తేలింది. ఇక ప్రపంచ దేశాలన్నీ కలిపి ఒక్క ఏడాదికి ధూమపానానికి చేస్తున్న ఖర్చు దాదాపు US $2 ట్రిలియన్స్. ఈ నేపథ్యంలో సామాజికంగా, ఆర్థికంగా తీవ్ర ప్రభావాన్ని చూపుతున్న ధూమపానానికి వ్యతిరేకంగా జరిగే పోరాటానికి అత్యవసరంగా మద్దతు తెలపాల్సిన అవసరం ఉందని తెలిపింది.
ఉత్పత్తుల అమ్మకాల్లో అమలుకాని నిబంధనలు..
దాదాపు అన్ని దేశాలు.. పిల్లలకు పొగాకు ఉత్పత్తుల మార్కెటింగ్, ప్రత్యక్ష అమ్మకాలను నిషేధించాయి. కానీ తక్కువ-మధ్య ఆదాయ దేశాల్లో ఈ నిషేధాలు కఠినంగా అమలు కావడం లేదు. భారత్‌లోనూ నిషేధాలు ఉన్నప్పటికీ పాఠశాలల చుట్టుపక్కలగల షాపుల విక్రేతలు పిల్లలు, యువతను ఆకట్టుకునే విధంగా పొగాకు ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నట్లు అధ్యయనంలో గమనించారు. 90 శాతం పొగాకు సంబంధిత డిస్‌ప్లేలు మిఠాయిలు, స్వీట్లు, బొమ్మలు తదితర పిల్లలకు విక్రయించే వస్తువుల పక్కనే ఉన్నాయని పేర్కొంది. ఈ మేరకు పొగాకు హాని తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా తప్పుడు సమాచారాన్ని ఎదుర్కొనేందుకు, ఆరోగ్యకర సమాచార వాతావరణాన్ని నిర్మించేందుకు ఉత్తమ పద్ధతులను అవలంబించాలని నివేదిక సిఫార్సు చేస్తోంది.
Disclaimer : smoking is injurious to health