మహిళా క్రికెటర్లకు ఇంకా ప్రైజ్ మనీ ఇవ్వని బీసీసీఐ

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా వేదికగా జరిగిన ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్‌కు టీమ్ ఇండియా చేరుకున్న విషయం తెలిసిందే. 2020లో జరిగిన ఈ మెగా టోర్నీ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత మహిళా జట్టు ఓడిపోయింది. రన్నరప్‌గా నిలిచినందుకు టీమ్ ఇండియాకు 50 వేల డాలర్ల ప్రైజ్ మనీ వచ్చింది. కాగా, ఏడాదిన్నర గడిచినా ఇప్పటికీ మహిళా క్రికెటర్లకు ఆ డబ్బును బీసీసీఐ అందించలేదు. దీంతో ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెటర్స్ అసోసియేషన్ […]

Update: 2021-05-23 11:01 GMT

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా వేదికగా జరిగిన ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్‌కు టీమ్ ఇండియా చేరుకున్న విషయం తెలిసిందే. 2020లో జరిగిన ఈ మెగా టోర్నీ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత మహిళా జట్టు ఓడిపోయింది. రన్నరప్‌గా నిలిచినందుకు టీమ్ ఇండియాకు 50 వేల డాలర్ల ప్రైజ్ మనీ వచ్చింది. కాగా, ఏడాదిన్నర గడిచినా ఇప్పటికీ మహిళా క్రికెటర్లకు ఆ డబ్బును బీసీసీఐ అందించలేదు. దీంతో ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెటర్స్ అసోసియేషన్ (ఫికా) ప్రతినిధి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించినట్లు ది టెలిగ్రాఫ్ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది.

గత ఏడాది ఫిబ్రవరి నెలలో వరల్డ్ కప్ జరిగిందని.. ఏడాది పైగా గడిచినా బీసీసీఐ మాత్రం క్రికెటర్లకు ప్రైజ్ మనీని ఇవ్వకుండా జాప్యం చేస్తున్నదని.. ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ బోర్డు కూడా ఇలా క్రికెటర్లకు ప్రైజ్ మనీ జాప్యం చేయడంపై ఫికా మండిపడింది. కాగా, ఈ విషయంపై బీసీసీఐ కూడా స్పందించింది. మరో వారం పది రోజుల్లో క్రికెటర్లకు ప్రైజ్ మనీ అందిస్తామని పేర్కొన్నది. గత ఏడాది టోర్నీ ముగిసిన చాలా వారాల తర్వాత ప్రైజ్ మనీ అందిందని.. అయితే అప్పటి నుంచి కరోనా కారణంగా బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో పరిమిత సిబ్బందితో పని చేస్తున్న కారణంగా చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయని సదరు ప్రతినిధి తెలిపారు.

Tags:    

Similar News