దక్షిణ చైనా సముద్రంలో ‘భారత యుద్ధనౌక’..
దిశ, వెబ్ డెస్క్: భారత్, చైనా మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రం మరో వ్యుహాత్మక అడుగు వేసినట్లు తెలుస్తోంది. దక్షిణ చైనా సముద్రంలోనికి భారత్ తన యుద్ధ నౌకను తరలించింది. రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నివారణకు చర్చలు జరుగుతున్న తరుణంలో భారత్ ఈ చర్యకు పూనుకోవడం తమకు అంగీకారం కాదని చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. సౌత్ చైనా సముద్ర ప్రాంతంలో ఇండియన్ నేవీ షిప్స్ ఉనికిని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని […]
దిశ, వెబ్ డెస్క్: భారత్, చైనా మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రం మరో వ్యుహాత్మక అడుగు వేసినట్లు తెలుస్తోంది. దక్షిణ చైనా సముద్రంలోనికి భారత్ తన యుద్ధ నౌకను తరలించింది. రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నివారణకు చర్చలు జరుగుతున్న తరుణంలో భారత్ ఈ చర్యకు పూనుకోవడం తమకు అంగీకారం కాదని చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది.
సౌత్ చైనా సముద్ర ప్రాంతంలో ఇండియన్ నేవీ షిప్స్ ఉనికిని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని ప్రకటించింది. 2009 నుంచి ఈ జలాల్లో డ్రాగన్ కంట్రీ కృత్రిమ ద్వీపాలను నిర్మించడం, సైన్యాన్ని మోహరించడంలో బిజీగా గడుపుతోంది. అయితే, వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న గాల్వన్ లోయలో చైనా ఆక్రమణ, 20 మంది భారత సైనికుల మరణానికి కారణమైంది.
ఈ ఘటనపై సీరియస్‌గా భారత ప్రభుత్వం తాజాగా సౌత్ చైనా సముద్రంలోకి ఇండియన్ నేవీ యుధ్ధ నౌకను తరలించిందని రక్షణ వర్గాలు తెలిపాయి. ఇదిలాఉండగా, ఈ సముద్ర జలాల్లో ఎక్కువ భాగం తమదేనని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఆఫ్ చైనా వాదిస్తోంది. అంతేకాకుండా, ఇక్కడ ఇతర దేశాలకు చెందిన నౌకల ఉనికిని ఏ మాత్రం సహించేది లేదని బహిరంగంగానే హెచ్చరిస్తోంది. కాగా, ఇదే సౌత్ చైనా సముద్రంలో అమెరికా తన యుధ్ధ నౌకలను మోహరించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా దక్షిణ చైనా సముద్ర జలాల్లో డ్రాగన్ అధిపత్యానికి చెక్ పెట్టాలని ఆలోచిస్తున్నారు.