న్యూజిలాండ్ కేబినెట్‌లో భారత మహిళకు చోటు..
దిశ, వెబ్‌డెస్క్ : న్యూజిలాండ్‌లో భారతీయ మహిళ అరుదైన ఘనత సాధించారు. కేరళలోని ఎర్నాకులానికి చెందిన ప్రియాంక రాధాకృష్ణన్.. న్యూజిలాండ్ ప్రధాని జెసిండా అర్డెర్న్ కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. న్యూజిలాండ్ దేశంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మొదటి భారతీయ మహిళగా ప్రియాంక రాధాకృష్ణన్ గుర్తింపు పొందారు. వివరాల్లోకి వెళితే.. గత నెలలో న్యూజిలాండ్‌లో జరిగిన సాధారణ ఎన్నికల్లో అధికార లేబర్ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో న్యూజిలాండ్ ప్రధాని జెసిండా అర్డెర్న్.. తన మంత్రివర్గంలో […]
దిశ, వెబ్‌డెస్క్ : న్యూజిలాండ్‌లో భారతీయ మహిళ అరుదైన ఘనత సాధించారు. కేరళలోని ఎర్నాకులానికి చెందిన ప్రియాంక రాధాకృష్ణన్.. న్యూజిలాండ్ ప్రధాని జెసిండా అర్డెర్న్ కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. న్యూజిలాండ్ దేశంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మొదటి భారతీయ మహిళగా ప్రియాంక రాధాకృష్ణన్ గుర్తింపు పొందారు.
వివరాల్లోకి వెళితే.. గత నెలలో న్యూజిలాండ్‌లో జరిగిన సాధారణ ఎన్నికల్లో అధికార లేబర్ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో న్యూజిలాండ్ ప్రధాని జెసిండా అర్డెర్న్.. తన మంత్రివర్గంలో ఐదుగురు కొత్త సభ్యులకు చోటు కల్పించారు. ఇందులో ఇండియాకు చెందిన ప్రియాంక రాధాకృష్ణన్ కూడా ఉన్నారు. ఇదిలాఉంటే.. ఎర్నాకులం జిల్లాలోని పరవూర్.. ప్రియాంక రాధాకృష్ణన్ స్వస్థలం. రామన్ రాధాకృష్ణన్, ఉషా దంపతులకు ప్రియాంక రాధాకృష్ణన్ జన్మించారు. సింగపూర్, న్యూజిలాండ్‌లో ఆమె తన చదవును పూర్తి చేశారు. ప్రస్తుతం ఆమె తన భర్తతో కలిసి ఆక్లాండ్‌లో నివసిస్తున్నారు. 2017లో మొదటిసారిగా లేబర్ పార్టీ తరఫున ఎన్నికల బరిలోకి దిగి ఎంపీ అయ్యారు. గత నెలలో జరిగిన సాధారణ ఎన్నికల్లో సైతం విజయం సాధించి.. ప్రధాని మంత్రివర్గంలో చోటు సంపాదించిన తొలి భారతీయురాలిగా రిక్డార్డులకెక్కారు.