బైక్ ప్రియులకు శుభవార్త.. దేశంలో మరో మూడు ‘ఇండియన్ చీఫ్’ బైకులు..

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ మోటర్‌సైకిల్ సంస్థ ఇండియన్ చీఫ్ దేశీయ మార్కెట్లో కొత్తగా మూడు బైకులను విడుదల చేసింది. వీటిధరలు రూ. 20.75 లక్షల(ఎక్స్‌షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. చీఫ్ డార్క్ హార్స్, ఇండియన్ చీఫ్ బాబర్ డార్క్ హార్స్, ఇండియన్ సూపర్ చీఫ్ లిమిటెడ్ పేరుతో ఈ మోడళ్లను కంపెనీ తీసుకొచ్చింది. వీటిలో ఇండియ సూపర్ చీఫ్ లిమిటెడ్ మోదల్ అత్యధీకంగా రూ. 22.84 లక్షల ధరలో లభిస్తుందని కంపెనీ పేర్కొంది. […]

Update: 2021-08-27 09:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ మోటర్‌సైకిల్ సంస్థ ఇండియన్ చీఫ్ దేశీయ మార్కెట్లో కొత్తగా మూడు బైకులను విడుదల చేసింది. వీటిధరలు రూ. 20.75 లక్షల(ఎక్స్‌షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. చీఫ్ డార్క్ హార్స్, ఇండియన్ చీఫ్ బాబర్ డార్క్ హార్స్, ఇండియన్ సూపర్ చీఫ్ లిమిటెడ్ పేరుతో ఈ మోడళ్లను కంపెనీ తీసుకొచ్చింది. వీటిలో ఇండియ సూపర్ చీఫ్ లిమిటెడ్ మోదల్ అత్యధీకంగా రూ. 22.84 లక్షల ధరలో లభిస్తుందని కంపెనీ పేర్కొంది.

ఈ మోడల్ బైకులు 1,890 సీసీ ఎయిర్‌కూల్‌డ్ ఇంజిన్‌తో పనిచేస్తాయని, సర్క్యులర్ టచ్ స్క్రీన్ రైడ్, స్టాండర్డ్ ఫీచర్‌గా యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్(ఏబీఎస్) ఉన్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటికీ వీటిని కొనేందుకు ప్రీ-బుకింగ్స్ ప్రారంభించామని, ముందుగా రూ. 3 లక్షలు చెల్లించడం ద్వారా బైకు బుక్ చేసుకోవచ్చని కంపెనీ వివరించింది. ఈ మోడల్ బైకుల్లో అధిక శక్తి అవసరంలేని సమయంలో ఇంజిన్ వెనక ఉన్నటువంటి ఇంజిన్‌ను ఆఫ్ చేసుకునే వీలుంటుందని కంపెనీ పేర్కొంది. 15 లీటర్ల ఫ్యుయెల్ ట్యాంక్, ఎల్ఈడీ లైటింగ్, కీ-లెస్ ఇగ్నిషన్ లాంటి అత్యాధునిక ఫీచర్లను ఇందులో అందిస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది.

‘దేశీయంగా కొత్త మోడళ్లను తీసుకురావడం సంతోషంగా ఉంది. ఈ బ్రాండ్ 100వ వార్షికోత్సవం సందర్భంగా భారతీయ వాహనదారుల కోసం వీటిని విడుదల చేశాం. ప్రపంచవ్యాప్తంగా స్థిరమైన అభిమానులకు కలిగిన తమ సంస్థ భారత మార్కెట్లో మరింత మంది వినియోగదారులను సంపాదిస్తుందని’ ఇండియన్ చీఫ్ ఇండియా మేనేజర్ లలిత్ శర్మ చెప్పారు.

Tags:    

Similar News