'ఫ్యామిలీ'ని ఆదుకునే ప్రయత్నం
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న క్రమంలో కలలో కూడా ఊహించని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దేశం ఎక్కడికక్కడ లాక్ అయిపోయింది. జనజీవనం స్తంభించి పోయింది. జీవన వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయాయి. దీంతో ఎంతో మంది రోజూ వారి కూలీలు తిండి లేకుండా పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆకలికేకలతో అలమటిస్తున్న పేదలు…. నీళ్లు తాగి కడుపు నింపుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. కరోనా కారణంగా మరణించడమేమో కానీ… ఆకలి చావులు నెలకొనే పరిస్థితి దాపురించేలా ఉంది. […]
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న క్రమంలో కలలో కూడా ఊహించని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దేశం ఎక్కడికక్కడ లాక్ అయిపోయింది. జనజీవనం స్తంభించి పోయింది. జీవన వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయాయి. దీంతో ఎంతో మంది రోజూ వారి కూలీలు తిండి లేకుండా పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆకలికేకలతో అలమటిస్తున్న పేదలు…. నీళ్లు తాగి కడుపు నింపుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. కరోనా కారణంగా మరణించడమేమో కానీ… ఆకలి చావులు నెలకొనే పరిస్థితి దాపురించేలా ఉంది. అటు చిత్ర పరిశ్రమలోనూ సినీ కార్మికుల దుస్థితి ఇదే మాదిరి ఉండగా… వారిని ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ముందుకొచ్చారు. ఎవరికి తోచిన సహాయం వారు అందిస్తూ మానవత్వాన్ని చాటుకున్నారు. అయితే తామంతా ఒక్కటైతే.. ఎక్కువ సంఖ్యలో నిరుపేద కళాకారులను ఆదుకునే అవకాశం ఉంటుందని భావించిన సినీ కళామతల్లి బిడ్డలు… ఇండియన్ ఫిల్మ్ వర్కర్స్‌ను ఆదుకునేందుకు గొప్ప ప్రయత్నం చేశారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్ వుడ్ ఇలా దేశంలోని అన్ని ఇండస్ట్రీలకు చెందిన దిగ్గజ నటులంతా కలిసి ఓ షార్ట్ ఫిల్మ్ చేశారు. ప్రసూన్ పాండే దర్శకత్వం వహించగా అమితాబ్ బచ్చన్ పర్యవేక్షణలో “ఫ్యామిలీ” అనే లఘుచిత్రాన్ని చేశారు. అమితాబ్ బచ్చన్, రజినీ కాంత్, చిరంజీవి, మమ్ముట్టి, మోహన్ లాల్, శివ రాజ్‌కుమార్, ప్రసేన్ జిత్ ఛటర్జీ, సోనాలీ కులకర్ణి, రణ్ బీర్ కపూర్, ప్రియాంక చోప్రా, అలియా భట్ లాంటి తారలు ఈ షార్ట్ ఫిల్మ్ చేసి మీకు మేమున్నామని భరోసా ఇస్తున్నారు.
‘ఫ్యామిలీ’ షార్ట్ ఫిల్మ్ స్టోరీ :
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన కూలింగ్ గ్లాసెస్ ఎక్కడున్నాయని అడుగుతుంటాడు. మొదట ఎవరు స్పందించకపోయినా … ఆయన పిలుపుకు ముందుగా దిల్జీత్ దోసంజ్ రెస్పాండ్ అవుతాడు. తర్వాత రణ్‌బీర్ కపూర్ కూడా కలిసి ఇద్దరూ కళ్లజోడు కోసం ఇళ్లంతా వెతుకుతుంటారు. ఈ క్రమంలో మమ్ముట్టి, రజినీకాంత్, చిరంజీవి, మోహన్ లాల్, శివ రాజ్‌కుమార్, ప్రసేన్ జిత్ ఛటర్జీ లను కళ్లజోడు కోసం అడుగుతుంటారు. అవి కాస్తా యోగా చేస్తున్న అలియా భట్ దగ్గర ఉంటాయి. ఆ కూలింగ్ గ్లాసెస్‌ను తీసుకుని దిల్జీత్ నేను ఇస్తానని వెళ్తుంటే… అవి రణ్ బీర్ లాక్కుంటాడు. అతడి నుంచి కళ్లజోడు తీసుకున్న ప్రియాంక చోప్రా చివరగా బచ్చన్‌కు అందించడంతో షార్ట్ ఫిల్మ్ ముగుస్తుంది.
‘ఫ్యామిలీ’ ఉద్దేశం :
‘ఫ్యామిలీ’ అనే లఘుచిత్రంలో నటించిన తారలంతా ఎవరి ఇళ్ల నుంచి వారే ఈ షార్ట్ ఫిల్మ్ చేయడం విశేషం. మేమంతా కలిసి షార్ట్ ఫిల్మ్ చేసినా ఈ క్రమంలో ఏ ఒక్కరు కూడా ఇంట్లో నుంచి బయటకు రాలేదని తెలిపారు బచ్చన్. తద్వారా స్టే హోం.. స్టే సేఫ్ మెస్సేజ్‌ను అందించారు. మిమ్మల్ని మీరు కరోనా నుంచి కాపాడుకోవాలని సూచించారు. అంతేకాదు ఈ షార్ట్ ఫిల్మ్ చేయడం వెనుక మరో ఉద్దేశం ఉందన్నారు బచ్చన్. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక్కటే అని… మేమంతా ఒక కుటుంబమని చాటి చెప్పేందుకే ఈ చిత్రాన్ని తీసినట్లు తెలిపారు. మా వెనుక చాలా పెద్ద కుటుంబం ఉందని… వారే సినీ కార్మికులని తెలిపారు. కానీ లాక్ డౌన్ కారణంగా వారు చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారన్నారు. అందుకే సోనీ టీవి, కళ్యాణ్ జువెల్లర్స్ లాంటి స్పాన్సర్స్‌తో మేమంతా కలిసి ఫండ్స్ సేకరిస్తున్నామన్నారు. ఇలా వచ్చిన విరాళాలతో దేశ వ్యాప్తంగా ఉన్న కార్మికులు, దినసరి కూలీలను ఆదుకుంటామని తెలిపారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో భయాందోళనకు గురికాకుండా .. జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Presenting ‘Family’, a made-at-home short film featuring @SrBachchan, #Rajnikanth #RanbirKapoor @priyankachopra @aliaa08, #Chiranjeevi @Mohanlal, #Mammootty, @meSonalee @prosenjitbumba #ShivaRajkumar & @diljitdosanjh.
Supported by #SonyPicturesNetworksIndia & #KalyanJewellers. pic.twitter.com/menuDz808H— sonytv (@SonyTV) April 6, 2020
Tags: Amitab Bachan, Chiranjeevi, Family, Short Film, Rajinikanth