‘క్లిష్ట పరిస్థితుల్లో భారత ఆటో పరిశ్రమ’
దిశ, వెబ్‌డెస్క్: భారత ఆటో పరిశ్రమ (Indian auto industry) చరిత్రలో ఎన్నడూ లేనంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోందని, జీఎస్టీ (GST) తగ్గించడం, ప్రోత్సాహక ఆధారిత స్క్రాపేజ్ విధానం ద్వారా ప్రభుత్వం సహకారం అవసరమని మారుతి సుజుకి (Maruti Suzuki) ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో కెనిచి అయుకవా శుక్రవారం తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం నుంచి కొనసాగుతున్న మందగమనానికి, ప్రస్తుత ఏడాదిలో కరోనా వైరస్ తోడవడంతో ఆటో రంగాన్ని (Auto field) కొన్నేళ్ల వెనక్కి వెళ్లిందని […]
దిశ, వెబ్‌డెస్క్: భారత ఆటో పరిశ్రమ (Indian auto industry) చరిత్రలో ఎన్నడూ లేనంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోందని, జీఎస్టీ (GST) తగ్గించడం, ప్రోత్సాహక ఆధారిత స్క్రాపేజ్ విధానం ద్వారా ప్రభుత్వం సహకారం అవసరమని మారుతి సుజుకి (Maruti Suzuki) ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో కెనిచి అయుకవా శుక్రవారం తెలిపారు.
గత ఆర్థిక సంవత్సరం నుంచి కొనసాగుతున్న మందగమనానికి, ప్రస్తుత ఏడాదిలో కరోనా వైరస్ తోడవడంతో ఆటో రంగాన్ని (Auto field) కొన్నేళ్ల వెనక్కి వెళ్లిందని ఆయన చెప్పారు. ఆరోగ్య సంక్షోభం తెలెత్తిన సందర్భంలో భారత్‌లోని ఆటో పరిశ్రమ వెంటిలేటర్లు, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ తయారీలో పాల్గోన్నది. వైరస్‌తో పోరాడ్డానికి విదేశాల నుంచి టెస్టింగ్ కిట్‌లను దిగుమతి చేసుకోవడం ద్వారా అమ్మకాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆయన వివరించారు.
ఆగస్టులో గతేడాదితో పోలిస్తే పనితీరు కొంత మెరుగ్గా ఉంది. అయినప్పటికీ 15-25 శాతం ప్రతికూల వృద్ధిని పరిశ్రమ నమోదు చేసిందని, దీనివల్ల పరిశ్రమ కొంత వెనకబడిందని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ తయారీదారుల (SIAM) వర్చువల్ 60వ వార్షిక సదస్సులో కెనిచి అయుకవా చెప్పారు. ఆటోమొబైల్స్‌పై జీఎస్టీని 10 శాతం తగ్గించాలనే సుధీర్ఘకాలంగా ఉన్న డిమాండ్‌ను ఆయన ప్రస్తావించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పరిశ్రమకు ప్రభుత్వ మద్దతు ఎంతో ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. జీఎస్టీ తగ్గింపుతో పాటు స్క్రాపేజ్ ప్రోత్సాహక పథకం కోసం తాము ఎదురుచూస్తున్నామని, పెరుగుతున్న టర్నోవర్‌పై పన్నులు ఎక్కువగా ఉన్నాయని ఆయన వెల్లడించారు.
ఆటో పరిశ్రమకు శుభవార్త…
కాగా, శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆటోమొబైల్ పరిశ్రమకు మరికొద్ది రోజుల్లో శుభవార్త వినిపిస్తామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ చెప్పారు. ఆటో పాలసీల విధానాలను సమీక్ష జరుపుతున్నట్టు, ఆటో పరిశ్రమ నిపుణుల సూచనలను పరిశీలిస్తున్నటు జవదేకర్ చెప్పారు. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ తయారీదారుల (SIAM) వర్చువల్ వార్షిక సదస్సులో మాట్లాడిన మంత్రి..పరిశ్రమకు డిమాండ్ పెంచేందుకు, ముఖ్యంగా పండుగ డిమాండ్ పెంచడానికి కొన్ని రాయితీలు లభిస్తాయన్నారు. జీఎస్టీ తగ్గింపు, టూ-వీలర్ సహా ప్రజా రవాణా వాహనాలకు జీఎస్టీ విధానంలో సానుకూల నిర్ణయాలు ఉంటాయన్నారు. ప్రస్తుతం వాహనాలపై జీఎస్టీ 28 శాతం విధిస్తున్నారు. అయితే, తుది నిర్ణయం ఆర్థిక మంత్రిత్వ శాఖ అధ్యయనం తర్వాత ఉంటుందని స్పష్టం చేశారు.