పట్టు బిగించిన భారత్..

దిశ, వెబ్‌డెస్క్ : వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి చైనా కంట్రీ చేస్తున్న కుట్రలను భారత్ తిప్పికొడుతూనే వస్తోంది. శాంతి చర్చలకు సిద్ధమంటూనే కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాకు తాజాగా భారత ఆర్మీ గట్టి షాక్ ఇచ్చింది. లద్దాక్‌లోని ప్యాంగాంగ్ సరస్సు దక్షిణ తీరంలోని పర్వత ప్రాంతాలతో పాటు, ఆ సరస్సు ఉత్తర ప్రాంతాన్ని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇక అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లోనూ కేంద్రం భారీగా బలగాలను మోహరించింది. తూర్పు లద్దాక్ ఫింగర్-4 పర్వత […]

Update: 2020-09-02 21:54 GMT

దిశ, వెబ్‌డెస్క్ :

వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి చైనా కంట్రీ చేస్తున్న కుట్రలను భారత్ తిప్పికొడుతూనే వస్తోంది. శాంతి చర్చలకు సిద్ధమంటూనే కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాకు తాజాగా భారత ఆర్మీ గట్టి షాక్ ఇచ్చింది. లద్దాక్‌లోని ప్యాంగాంగ్ సరస్సు దక్షిణ తీరంలోని పర్వత ప్రాంతాలతో పాటు, ఆ సరస్సు ఉత్తర ప్రాంతాన్ని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

ఇక అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లోనూ కేంద్రం భారీగా బలగాలను మోహరించింది. తూర్పు లద్దాక్ ఫింగర్-4 పర్వత శిఖరాలు, ఇతర ప్రాంతాలను ఆధీనంలోకి తీసుకోవడం ద్వారా చైనా భారత్ పైచేయి సాధించినట్లు అయింది. దీంతో చైనాతో సరిహద్దు పంచుకుంటున్న భారత భూభాగం అండర్ కంట్రోలోనే ఉందని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఈ చర్యతో ఇండియన్ ఆర్మీ సామర్థ్యం ఎంటో చైనాకు అర్థమయ్యే ఉంటుందని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News