‘ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్ పై అవాస్తవాలు వద్దు’

దిశ, వెబ్‌డెస్క్: గుంజన్ సక్సేనా-ది కార్గిల్ గర్ల్ సినిమాపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సినిమా తీసే ముందు ఎయిర్ ఫోర్స్ ప్రతిష్టను పెంచుతామని చెప్పిన చిత్ర యూనిట్ గుంజన్ సక్సేనా క్యారెక్టర్‌ను హైప్ చేయడం కోసం.. ట్రైలర్‌లో ఐఏఎఫ్‌ పై అభ్యంతరకర, నెగిటెవ్ సీన్‌లు పెట్టారని తెలిపింది. లింగ బేధాన్ని లేవనెత్తారని.. ఈ సీన్‌ను తొలగించాలని లేఖలో వెల్లడిస్తూ.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌కు పంపించింది. అలాగే, నెట్ […]

Update: 2020-08-12 08:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: గుంజన్ సక్సేనా-ది కార్గిల్ గర్ల్ సినిమాపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సినిమా తీసే ముందు ఎయిర్ ఫోర్స్ ప్రతిష్టను పెంచుతామని చెప్పిన చిత్ర యూనిట్ గుంజన్ సక్సేనా క్యారెక్టర్‌ను హైప్ చేయడం కోసం.. ట్రైలర్‌లో ఐఏఎఫ్‌ పై అభ్యంతరకర, నెగిటెవ్ సీన్‌లు పెట్టారని తెలిపింది. లింగ బేధాన్ని లేవనెత్తారని.. ఈ సీన్‌ను తొలగించాలని లేఖలో వెల్లడిస్తూ.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌కు పంపించింది. అలాగే, నెట్ ఫ్లిక్స్, ధర్మ ప్రొడక్షన్‌కు హౌస్‌కు కూడా లెటర్‌ను సెండ్ చేసింది.

ఈ సినిమాలో గుంజన్ సక్సేనా పాత్రలో అందాల తార శ్రీదేవి కుతూరు జాన్వీ కపూర్‌ నటిస్తుండడం విశేషం. అయితే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లోనే తొలి పైలెట్‌గా పేరొందిన గుంజన్ సక్సేనా జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 1999లో జరిగిన కార్గిల్‌వార్‌లో పాల్గొన్న సైనికులకు గాయాలు అయినప్పుడు.. వారిని రక్షించడంలో గుంజన్ సక్సేనా కీలక పాత్ర వహించారు. ఈ నేపథ్యంలోనే ఆమె కథను తెరకెక్కిస్తున్నారు. అయితే, సినిమాలో గుంజన్ క్యారెక్టర్‌ హైప్ పెంచడానికి ఐఏఎఫ్‌పై అవాస్తవాలను చూయించకూడదని ఇండియన్ ఆర్మీ లేఖలో నొక్కి చెప్పడం గమనార్హం.

Tags:    

Similar News