ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. స్కాట్‌లాండ్‌పై టీమిండియా ఘన విజయం

దిశ, వెబ్‌డెస్క్: టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా మరో విక్టరీ కొట్టింది. స్కాట్‌లాండ్‌‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో భారీ విజయం నమోదు చేసుకుంది. మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన స్కాట్లాండ్ 17.4 ఓవర్లలో 85 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్ల దాటికి స్కాట్లాండ్ నిలువలేకపోయింది. టీమిండియా బౌలర్లలో మహ్మద్ షమి, రవీంద్ర జడేజా చెరో 3 వికెట్లు తీయగా.. బుమ్రా 2 వికెట్లు, అశ్విన్ 1 వికెట్ తీశారు. భారత్ మెరుపు […]

Update: 2021-11-05 10:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా మరో విక్టరీ కొట్టింది. స్కాట్‌లాండ్‌‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో భారీ విజయం నమోదు చేసుకుంది. మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన స్కాట్లాండ్ 17.4 ఓవర్లలో 85 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్ల దాటికి స్కాట్లాండ్ నిలువలేకపోయింది. టీమిండియా బౌలర్లలో మహ్మద్ షమి, రవీంద్ర జడేజా చెరో 3 వికెట్లు తీయగా.. బుమ్రా 2 వికెట్లు, అశ్విన్ 1 వికెట్ తీశారు.

భారత్ మెరుపు ఇన్నింగ్స్..

86 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఓపెనర్లు ఆది నుంచి మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ముఖ్యంగా కేఎల్ రాహుల్ తొలి 18 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక 19వ బంతిని షాట్ ఆడబోయి క్యాచ్ అవుట్ అయ్యాడు. అంతకు ముందు రోహిత్ శర్మ 16 బంతుల్లో 5 ఫోర్లు 1 సిక్సర్ కొట్టి 30 పరుగులతో(lbw) పెవిలియన్ చేరాడు. దీంతో 82 పరుగుల వద్ద టీమిండియా 2 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ(2 నాటౌట్), సూర్య కుమార్ యాదవ్(6 నాటౌట్‌)గా నిలిచి మిగతా ఇన్నింగ్స్‌ను పూర్తి చేశారు. కేవలం 6.3 ఓవర్లలో 89 పరుగులు చేసి, 8 వికెట్ల భారీ తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది.

Tags:    

Similar News