టీ20 వరల్డ్ కప్‌లో భారత్ ఘన విజయం.. తోక ముడిచిన అఫ్ఘన్
దిశ, వెబ్‌డెస్క్: టీ20 వరల్డ్ కప్‌లో ఎట్టకేలకు టీమిండియా సత్తా చాటింది. అప్ఘనిస్తాన్ జట్టుపై 66 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవరల్లో 2 వికెట్ల నష్టానికి ఏకంగా 210 పరుగులు నమోదు చేసింది. వరుసగా రెండు (పాకిస్తాన్-న్యూజీలాండ్) మ్యాచుల్లో ఘోరంగా విఫలమైన ఓపెనర్లు.. అఫ్గనిస్తాన్ మ్యాచ్‌లో ఫామ్‌లోకి వచ్చారు. ఓపెనర్లు కేఎల్ రాహుల్(69)-రోహిత్ శర్మలు(74) ఆది నుంచి ధాటిగా ఆడారు. టీమిండియా ఓపెనర్లుగా […]
దిశ, వెబ్‌డెస్క్: టీ20 వరల్డ్ కప్‌లో ఎట్టకేలకు టీమిండియా సత్తా చాటింది. అప్ఘనిస్తాన్ జట్టుపై 66 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవరల్లో 2 వికెట్ల నష్టానికి ఏకంగా 210 పరుగులు నమోదు చేసింది. వరుసగా రెండు (పాకిస్తాన్-న్యూజీలాండ్) మ్యాచుల్లో ఘోరంగా విఫలమైన ఓపెనర్లు.. అఫ్గనిస్తాన్ మ్యాచ్‌లో ఫామ్‌లోకి వచ్చారు. ఓపెనర్లు కేఎల్ రాహుల్(69)-రోహిత్ శర్మలు(74) ఆది నుంచి ధాటిగా ఆడారు. టీమిండియా ఓపెనర్లుగా అత్యధిక భాగస్వామ్యాన్ని(140) నెలకొల్పారు. వీరిద్దరి పెవిలియన్ అనంతరం క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్(27), హార్దిక్ పాండ్యా(35) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. దీంతో రెండు వికెట్ల నష్టానికి టీమిండియా భారీ స్కోర్ 210/2 నమోదు చేసింది.
లక్ష్య ఛేదనలో అఫ్ఘనిస్తాన్ విల విల..
211 పరుగుల లక్ష్య ఛేదనలో అఫ్ఘనిస్తాన్ బ్యాటర్లు విఫలమయ్యారు. ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్(13), మహ్మద్ షాజాద్(0) చేతులెత్తేశారు. రహ్మానుల్లా గుర్బాజ్(19), గుల్బాడిన్ నైబ్ (18), నజీబుల్లా జద్రాన్ (11) పరుగులు చేసి పెవిలియన్ చేరారు. దీంతో 69 పరుగులకే అఫ్ఘనిస్తాన్ 5 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ మహహ్మద్ నబీ(35), కరీం జనత్(42 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. నబీ తర్వాత క్రీజులోకి వచ్చిన రషీద్ ఖాన్ డకౌట్, షరాఫుద్దీన్ అష్రఫ్ (2 నాట్‌ట్)గా నిలిచే సరికి నిర్ణీత 20 ఓవర్లు ముగిశాయి. ఈ క్రమంలో 7 వికెట్లు కోల్పోయిన అఫ్ఘనిస్తాన్ 144 పరుగులకే పరిమితం అయింది. ఈ క్రమంలో టీమిండియా 66 పరుగుల భారీ తేడాతో విక్టరీ కొట్టింది.