ఒలంపిక్స్‌లో రికార్డు సృష్టించిన భారత హాకీ జట్టు.. పతకం సొంతం
దిశ, వెబ్‌డెస్క్ : టోక్యో ఒలంపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు రికార్డు సృష్టించింది. ఒలంపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించి.. దేశానికి మరో పతకాన్ని అందించింది. సెమీస్‌లో ఓటమి చెందిన పురుషుల హాకీ జట్టు.. కాంస్య పతక పోరులో జర్మనీపై వీరోచిత పోరాటం చేసింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు జర్మనీపై 5-4 గోల్స్ తేడాతో విజయం సాధించింది. అయితే మ్యాచ్ ప్రారంభమైన సమయం నుంచి రెండు జట్ల మధ్య పోరు హోరహోరీగా సాగింది. చివరకు […]
దిశ, వెబ్‌డెస్క్ : టోక్యో ఒలంపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు రికార్డు సృష్టించింది. ఒలంపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించి.. దేశానికి మరో పతకాన్ని అందించింది. సెమీస్‌లో ఓటమి చెందిన పురుషుల హాకీ జట్టు.. కాంస్య పతక పోరులో జర్మనీపై వీరోచిత పోరాటం చేసింది.
గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు జర్మనీపై 5-4 గోల్స్ తేడాతో విజయం సాధించింది. అయితే మ్యాచ్ ప్రారంభమైన సమయం నుంచి రెండు జట్ల మధ్య పోరు హోరహోరీగా సాగింది. చివరకు భారత జట్టు విజయాన్ని అందుకుంది. అయితే 41 ఏళ్ల తర్వాత పురుషుల హాకీ జట్టు ఒలంపిక్స్‌లో పతకం సాధించడం విశేషం. చివరి సారిగా 1980లో మాస్కోలో జరిగిన ఒలంపిక్స్‌లో భారత హాకీ జట్టు స్వర్ణ పతకం సాధించింది.