కెనడాకు ఇండియా వార్నింగ్

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ సరిహద్దులో జరుగుతున్న రైతు ఆందోళనలపై కెనడా పీఎం జస్టిన్ ట్రూడో వ్యాఖ్యలు చేయడాన్ని భారత్ ఖండించింది. కెనడా పీఎం ట్రూడో, ఆ దేశ చట్టసభ్యులు తమ దేశ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటే దౌత్యపరమైన సంబంధాలు దెబ్బతింటాయని హెచ్చరించింది. కెనడా నేతలు అదే వైఖరిని కొనసాగిస్తే తీవ్రపరిణామాలుంటాయని పేర్కొంది. ఆ వ్యాఖ్యలు కెనడాలోని తమ దేశ దౌత్యకార్యాలయాల ఎదుట అతివాద కార్యకలాపాలను ప్రోత్సహించేలా ఉన్నాయని భారత విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కెనడా […]

Update: 2020-12-04 11:42 GMT

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ సరిహద్దులో జరుగుతున్న రైతు ఆందోళనలపై కెనడా పీఎం జస్టిన్ ట్రూడో వ్యాఖ్యలు చేయడాన్ని భారత్ ఖండించింది. కెనడా పీఎం ట్రూడో, ఆ దేశ చట్టసభ్యులు తమ దేశ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటే దౌత్యపరమైన సంబంధాలు దెబ్బతింటాయని హెచ్చరించింది. కెనడా నేతలు అదే వైఖరిని కొనసాగిస్తే తీవ్రపరిణామాలుంటాయని పేర్కొంది. ఆ వ్యాఖ్యలు కెనడాలోని తమ దేశ దౌత్యకార్యాలయాల ఎదుట అతివాద కార్యకలాపాలను ప్రోత్సహించేలా ఉన్నాయని భారత విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కెనడా దౌత్యాధికారులకు తాకీదులు అందించింది. భారత దౌత్యాధికారులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కెనడా సర్కారుకు ఉంటుందని తెలిపింది.

Tags:    

Similar News