వచ్చే ఏడాది నుంచి సోలార్ పరికరాలపై సుంకం విధింపు
దిశ, వెబ్‌డెస్క్: విదేశీ సరఫరాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తూ, దేశీయంగా పరికరాల తయారీని పెంచేందుకు వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి సోలార్ మాడ్యూల్ దిగుమతులపై 40 శాతం కస్టమ్స్ సుంకాన్ని విధించనున్నట్టు ఇంధన మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే, సోలార్ సెల్స్ దిగుమతులపై 25 శాతం కస్టమ్స్ సుంకం కూడా ఉందని మంత్రిత్వ శాఖ తన వెబ్‌సైట్‌లో ప్రచురించిన నోట్‌లో పేర్కొంది. అయితే, ఈ సుంకాలు ఎంతకాలం వర్తిస్తాయనే అంశం ప్రస్తావించలేదు. గతేడాది మధ్య భాగంలో కరోనా సంబంధిత […]
దిశ, వెబ్‌డెస్క్: విదేశీ సరఫరాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తూ, దేశీయంగా పరికరాల తయారీని పెంచేందుకు వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి సోలార్ మాడ్యూల్ దిగుమతులపై 40 శాతం కస్టమ్స్ సుంకాన్ని విధించనున్నట్టు ఇంధన మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే, సోలార్ సెల్స్ దిగుమతులపై 25 శాతం కస్టమ్స్ సుంకం కూడా ఉందని మంత్రిత్వ శాఖ తన వెబ్‌సైట్‌లో ప్రచురించిన నోట్‌లో పేర్కొంది. అయితే, ఈ సుంకాలు ఎంతకాలం వర్తిస్తాయనే అంశం ప్రస్తావించలేదు. గతేడాది మధ్య భాగంలో కరోనా సంబంధిత అంతరాయాలు, చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో భారత్ సోలార్ పరికరాల దిగుమతులపై సుంకాలను ప్రతిపాదించింది.
దీన్నిబట్టి 2022 మార్చి 31 వరకు సోలార్ మోడ్యూల్స్, సెల్స్‌పై సున్నా బేసిక్ కస్టమ్స్ సుంకం అమలులో ఉంటుందని, ఆ తర్వాత మాడ్యూల్స్‌పై 40 శాతం, సెల్స్‌పై 20 శాతం సుంకాలు వర్తిస్తాయని మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ అంశపై మాట్లాడిన యాంప్ ఎనర్జీ ఇండియా హెడ్ పినాకి భట్టాచార్య.. ‘సోలార్ పరికరాల ధరలు అధికంగా ఉన్నాయి. దీనివల్ల పంపిణీ సంస్థలతో పాటు వినియోగదారులకు కూడా సోలార్ పవర్ ఖర్చు ఒకేలా పెరుగుతుంది. ఈ క్రమంలో తయారీదారులు వారి సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యక్ష రాయితీలను ఇవ్వాలి. దీనివల్ల భారత్‌లో ఈ రంగానికి ప్రయోజనకరంగా ఉంటుందని’ చెప్పారు.