కరోనా టెస్టుల్లో రికార్డు సృష్టించిన ఇండియా

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా టెస్టులు చేయడంలో ఇండియా మరో మైలురాయిని సాధించింది. కేవలం యేడాదిలోనే 50 కోట్ల టెస్టులు చేసి రికార్డు సృష్టించింది. దీనిని కేంద్ర ప్రజారోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది. గతేడాది జూలై నుంచి ఆగస్టు 19 వరకు దేశవ్యాప్తంగా 50 కోట్ల టెస్టులు పూర్తయ్యాయి. అయితే కరోనా సెకండ్ వేవ్ విజృంభించిన ఏప్రిల్, మే, జూన్ నెలల్లో అత్యధికంగా టెస్టులు చేసినట్లు వెల్లడించారు. అయితే ఈ 50 కోట్లలో […]

Update: 2021-08-21 10:57 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా టెస్టులు చేయడంలో ఇండియా మరో మైలురాయిని సాధించింది. కేవలం యేడాదిలోనే 50 కోట్ల టెస్టులు చేసి రికార్డు సృష్టించింది. దీనిని కేంద్ర ప్రజారోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది.

గతేడాది జూలై నుంచి ఆగస్టు 19 వరకు దేశవ్యాప్తంగా 50 కోట్ల టెస్టులు పూర్తయ్యాయి. అయితే కరోనా సెకండ్ వేవ్ విజృంభించిన ఏప్రిల్, మే, జూన్ నెలల్లో అత్యధికంగా టెస్టులు చేసినట్లు వెల్లడించారు. అయితే ఈ 50 కోట్లలో ఏప్రిల్ లో 4 కోట్ల టెస్టులు, మే నెలలో 6 కోట్లు, జూన్ నెలలో 7 కోట్ల టెస్టులు చేసినట్లు పేర్కొన్నారు.

Tags:    

Similar News