భారత్ భద్రతే ముఖ్యం : శ్రీలంక
దిశ, వెబ్ డెస్క్ :శ్రీలంక విదేశాంగ శాఖ కార్యదర్శిగా అడ్మిరల్ జయనాథ్ కొలంబగే నియామకం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండియాకు పెద్ద పీట వేయాలన్నదే తమ నూతన విదేశాంగ విధానమని ప్రకటించారు. తమ దేశంలో చైనా ప్రాబల్యం పెరుగుతోందన్న ఆందోళన నేపథ్యంలో ‘భారత్ భద్రతే ముఖ్యమని’ కొలంబగే స్పష్టంచేశారు. ప్రెసిడెంట్ గొటబయ రాజపక్స ఈ నెల 14న కొలంబగేను విదేశాంగ శాఖ కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. కాగా, ఈయన 2012-14 మధ్య కాలంలో […]
దిశ, వెబ్ డెస్క్ :శ్రీలంక విదేశాంగ శాఖ కార్యదర్శిగా అడ్మిరల్ జయనాథ్ కొలంబగే నియామకం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండియాకు పెద్ద పీట వేయాలన్నదే తమ నూతన విదేశాంగ విధానమని ప్రకటించారు. తమ దేశంలో చైనా ప్రాబల్యం పెరుగుతోందన్న ఆందోళన నేపథ్యంలో ‘భారత్ భద్రతే ముఖ్యమని’ కొలంబగే స్పష్టంచేశారు.
ప్రెసిడెంట్ గొటబయ రాజపక్స ఈ నెల 14న కొలంబగేను విదేశాంగ శాఖ కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. కాగా, ఈయన 2012-14 మధ్య కాలంలో శ్రీలంక నావికా దళం చీఫ్‌గా పనిచేసిన అనుభవం ఉంది.
అడ్మిరల్ కొలంబగే బుధవారం ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. శ్రీలంక నూతన విదేశాంగ విధానం గురించి వివరించారు. ‘భారత దేశానికి పెద్ద పీట’ వేయాలన్నదే శ్రీలంక నూతన ప్రాంతీయ విధానమని ప్రకటించారు. భారత్ భద్రతా ప్రయోజనాలకు హానికరమైన వాటిని శ్రీలంక చేయదని మరోసారి స్పష్టం చేశారు.