గుడ్‌న్యూస్.. దేశంలో భారీగా తగ్గిన కేసులు, మరణాలు

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా తగ్గాయి. పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ కఠినంగా అమలు చేస్తు్న్న కారణంగా కేసులు తగ్గడంతో పాటు మరణాల సంఖ్య కూడా తగ్గుతోంది. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 86,498 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అదే సమయంలో కరోనాతో 2,123 మంది మృతి చెందారు. ఇక నిన్న ఒక్కరోజే కరోనా నుంచి 1,82,282 కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో […]

Update: 2021-06-07 22:43 GMT

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా తగ్గాయి. పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ కఠినంగా అమలు చేస్తు్న్న కారణంగా కేసులు తగ్గడంతో పాటు మరణాల సంఖ్య కూడా తగ్గుతోంది. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 86,498 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అదే సమయంలో కరోనాతో 2,123 మంది మృతి చెందారు. ఇక నిన్న ఒక్కరోజే కరోనా నుంచి 1,82,282 కోలుకున్నారు.

ప్రస్తుతం దేశంలో 13,03,702 యాక్టివ్ కేసులు ఉన్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తాజా బులిటెన్‌లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 2,89,96,473 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 2,73,41,462 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా బారినపడి 3,51,309 మంది మృత్యువాతపడ్డారు. దేశంలో ఇప్పటికి 23,61,98,726 మందికి వ్యాక్సినేషన్ చేసినట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది.

 

Tags:    

Similar News