మూడో రెన్యూవబుల్‌ ఎనర్జీ ఆకర్షణ దేశంగా భారత్!

దిశ, వెబ్‌డెస్క్: సోలార్ ఫోటోవోల్టాయిక్(పీవీ) విభాగంలో అసాధారణ పనితీరు నేపథ్యంలో భారత్ ప్రపంచంలో మూడవ పునరుత్పాదక శక్తి(రెన్యూవబుల్‌ ఎనర్జీ) ఆకర్షణ దేశంగా నిలిచిందని ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ ఈవై నివేదిక తెలిపింది. పునరుత్పాదక శక్తి ఆకర్షణ దేశాల సూచీలో మొదటిస్థానంలో అమెరికా, రెండో స్థానంలో చైనా దేశాలు ఉన్నాయి. తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. కొవిడ్-19 మహమ్మారి తర్వాత భారత సౌర రంగం గణనీయంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. సోలార్ పీవీ పరిశ్రమ 2040 […]

Update: 2021-05-20 07:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: సోలార్ ఫోటోవోల్టాయిక్(పీవీ) విభాగంలో అసాధారణ పనితీరు నేపథ్యంలో భారత్ ప్రపంచంలో మూడవ పునరుత్పాదక శక్తి(రెన్యూవబుల్‌ ఎనర్జీ) ఆకర్షణ దేశంగా నిలిచిందని ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ ఈవై నివేదిక తెలిపింది. పునరుత్పాదక శక్తి ఆకర్షణ దేశాల సూచీలో మొదటిస్థానంలో అమెరికా, రెండో స్థానంలో చైనా దేశాలు ఉన్నాయి. తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. కొవిడ్-19 మహమ్మారి తర్వాత భారత సౌర రంగం గణనీయంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. సోలార్ పీవీ పరిశ్రమ 2040 నాటికి బొగ్గు ఆధారిత విద్యుత్ పరిశ్రమను అధిగమించగలదని ఈవై ఓ ప్రకటనలో తెలిపింది.

భారత్‌లో సోలార్ పీవీ అత్యంత ఖర్చుతో కూడుకున్న విద్యుత్ వనరుగా మారేందుకు ప్రభుత్వ విధానాలు కారణమయ్యాయని నివేదిక అభిప్రాయపడింది. ప్రపంచవ్యాప్తంగా ఈవై విడుదల చేసిన 57వ ఈవై రెన్యూవబుల్ ఎనర్జీ కంట్రీ అట్రాక్టివ్‌నెస్ ఇండెక్స్ నివేదికలో ఈవై ఈ వివరాలను వెల్లడించింది. 2020లో ప్రపంచ పునరుత్పాదక ఇంధన సామర్థ్యం కోసం పెట్టుబడులు 2 శాతం పెరిగి రూ. 22 లక్షల కోట్లకు చేరుకున్నాయి. కరోనా మహమ్మారి ప్రభావం ఉన్నప్పటికీ రెండో అత్యధిక వార్షిక వృద్ధి ఇదని ఈవై తెలిపింది.

Tags:    

Similar News