పీవోకేలో ఎన్నికలకు పాక్ సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్.. మండిపడ్డ భారత్

భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఎన్నో ఏండ్లుగా వివాదాస్పదంగా ఉన్న పాక్ ఆక్రమిత (పీవోకే) ప్రాంతం గిల్గిత్ బాల్టిస్తాన్. ఈ భూభాగంపై పాకిస్తాన్‌కు ఎలాంటి హక్కులు లేవని భారత్ దశాబ్దాలుగా అంతర్జాతీయ వేదికలపై వాదిస్తూనే ఉంది. తాజాగా అక్కడ ఎన్నికలు నిర్వహించడానికి పాకిస్తాన్ సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాక్ సుప్రీంకోర్టుకు ఆ హక్కు లేదని భారత ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఈ మేరకు పాక్ దౌత్యాధికారి ద్వారా భారత […]

Update: 2020-05-04 08:08 GMT

భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఎన్నో ఏండ్లుగా వివాదాస్పదంగా ఉన్న పాక్ ఆక్రమిత (పీవోకే) ప్రాంతం గిల్గిత్ బాల్టిస్తాన్. ఈ భూభాగంపై పాకిస్తాన్‌కు ఎలాంటి హక్కులు లేవని భారత్ దశాబ్దాలుగా అంతర్జాతీయ వేదికలపై వాదిస్తూనే ఉంది. తాజాగా అక్కడ ఎన్నికలు నిర్వహించడానికి పాకిస్తాన్ సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాక్ సుప్రీంకోర్టుకు ఆ హక్కు లేదని భారత ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఈ మేరకు పాక్ దౌత్యాధికారి ద్వారా భారత విదేశాంగ శాఖ ఒక లేఖను పాకిస్తాన్‌కు అందించింది. పాకిస్తాన్ ఆక్రమించిన గిల్గిత్ బాల్టిస్తాన్‌పై సర్వహక్కులు భారత్‌వేనని.. దానిపై న్యాయపరమైన నిర్ణయాలు తీసుకునే హక్కు పాకిస్తాన్ సుప్రీంకోర్టుకు ఏమాత్రం లేదని లేఖలో పేర్కొంది. అంతర్జాతీయ చట్టాలకు విరుద్దంగా ఆక్రమించుకున్న ప్రాంతాలపై పాకిస్తాన్‌కు ఎలాంటి హక్కులు ఉండవని.. ఇక అక్కడి సుప్రీంకోర్టు ఎలా జోక్యం చేసుకోగలదని భారత్ వాదిస్తోంది. పీవోకేలో ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా పాకిస్తాన్ 2018లో ఒక చట్టం తీసుకొని వచ్చింది. అప్పుడే భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కాని పాకిస్తాన్ మాత్రం కుటిలంగా వ్యవహరిస్తూ ఇప్పుడు ఏకంగా ఎన్నికలు నిర్వహించడానికి సిద్దమవుతోంది. పాకిస్తాన్ ప్రభుత్వం అక్కడ ఎన్నికలు నిర్వహించి ఆ ప్రాంతంపై తమదే హక్కని చాటుకోవడానికి ప్రయత్నిస్తోందని భారత్ అంటోంది.

Tags : POK, Pakistan, Supreme Court, Gilgit Baltistan, Elections, India

Tags:    

Similar News