మరో కొవిడ్ యాంటీబాడీ డ్రగ్‌కు భారత్ గ్రీన్ సిగ్నల్

న్యూఢిల్లీ: కరోనా చికిత్స కోసం భారత ప్రభుత్వం మరో కాక్‌టెయిల్ డ్రగ్‌కు అత్యవసర అనుమతినిచ్చింది. అమెరికా బయోఫార్మాస్యూటికల్ దిగ్గజం ఎలీ లిల్లీకి చెందిన మోనోక్లోనల్ యాంటీబాడీస్ బామ్లానివిమాబ్(700ఎంజీ), ఇటెసివిమాబ్(1400ఎంజీ) కాంబినేషన్ కాక్‌టెయిల్(రెండింటినీ కలిపి ఇంజెక్ట్ చేయడం) డ్రగ్‌కు దేశంలో అత్యవసర వినియోగానికి డ్రగ్ రెగ్యులేటరీ అనుమతినిచ్చిందని సంస్థ ఓ ప్రకటనలో మంగళవారం ప్రకటించింది. స్వల్ప, మధ్యస్థ తీవ్రతతో హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్లకు ఈ మందు వినియోగించవచ్చునని తెలిపింది. 12ఏళ్లు పైబడి కనీసం 40 ఏళ్ల […]

Update: 2021-06-01 09:14 GMT

న్యూఢిల్లీ: కరోనా చికిత్స కోసం భారత ప్రభుత్వం మరో కాక్‌టెయిల్ డ్రగ్‌కు అత్యవసర అనుమతినిచ్చింది. అమెరికా బయోఫార్మాస్యూటికల్ దిగ్గజం ఎలీ లిల్లీకి చెందిన మోనోక్లోనల్ యాంటీబాడీస్ బామ్లానివిమాబ్(700ఎంజీ), ఇటెసివిమాబ్(1400ఎంజీ) కాంబినేషన్ కాక్‌టెయిల్(రెండింటినీ కలిపి ఇంజెక్ట్ చేయడం) డ్రగ్‌కు దేశంలో అత్యవసర వినియోగానికి డ్రగ్ రెగ్యులేటరీ అనుమతినిచ్చిందని సంస్థ ఓ ప్రకటనలో మంగళవారం ప్రకటించింది. స్వల్ప, మధ్యస్థ తీవ్రతతో హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్లకు ఈ మందు వినియోగించవచ్చునని తెలిపింది.

12ఏళ్లు పైబడి కనీసం 40 ఏళ్ల బరువున్న పిల్లలకూ ఈ మందు ఇవ్వవచ్చు. ఇండియాలో పేషెంట్ల కోసం తమ మందును ముందుకు తీసుకురావడం సంతోషంగా ఉన్నదని, భారత్, సహా ఇతరదేశాల్లోనూ కరోనాపోరులో పాలుపంచుకుంటున్నామని లిల్లీ ఇండియా ఎండీ లూకా వాసిని వివరించారు. తమ మందులను విరాళంగా అందజేసి చికిత్స ప్రక్రియను వేగవంతం చేయడానికి భారత డ్రగ్ రెగ్యులేటరీతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపారు. మే నెలలో రెజెనరన్, రోచెలకు చెందిన యాంటీబాడీ కాక్‌టెయిల్‌కు భారత్ అత్యవసర అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News