రౌడీలా.. ఆసిస్ క్రికెట్ ఫ్యాన్స్‌పై కొహ్లీ ఫైర్
దిశ, వెబ్‌డెస్క్: సిడ్ని క్రికెట్ స్టేడియం వేదికగా ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న మూడో టెస్టులో టీమిండిమా పేసర్ మహ్మద్ సిరాజ్‌కు మరోసారి జాత్యహంకార వ్యాఖ్యలు ఎదురయ్యాయి. రెండో సెషన్‌లో కామెరాన్ గ్రీన్ ధాటిగా ఆడుతుండగా సిరాజ్ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నాడు. అదే సమయంలో పలువురు ఆసిస్ ప్రేక్షకులు సిరాజ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. దీంతో అంపైర్లకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై టీమిండియా సారథి విరాట్ కోహ్లీ స్పందించారు. ఈ […]
దిశ, వెబ్‌డెస్క్: సిడ్ని క్రికెట్ స్టేడియం వేదికగా ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న మూడో టెస్టులో టీమిండిమా పేసర్ మహ్మద్ సిరాజ్‌కు మరోసారి జాత్యహంకార వ్యాఖ్యలు ఎదురయ్యాయి. రెండో సెషన్‌లో కామెరాన్ గ్రీన్ ధాటిగా ఆడుతుండగా సిరాజ్ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నాడు. అదే సమయంలో పలువురు ఆసిస్ ప్రేక్షకులు సిరాజ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. దీంతో అంపైర్లకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై టీమిండియా సారథి విరాట్ కోహ్లీ స్పందించారు. ఈ సందర్భంగా ఆసిస్ ఫ్యాన్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆట జరుగుతున్నప్పుడు మైదానంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం విచారకరం అన్నారు. దీనిని తీవ్రంగా పరిగణించాలని అన్నారు. అంతేగాకుండా సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకొని, మరోసారి ఇలాంటి ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయని, తాను కూడా జాత్యహంకార కామెంట్స్ ఎదుర్కొన్నానని కోహ్లీ చెప్పాడు. ఆస్ట్రేలియన్ ప్రేక్షకులు పూర్తిగా రౌడీల్లా ప్రవర్తిస్తున్నారంటూ విరాట్ ఫైర్ అయ్యారు.