బోర్డర్ ఘర్షణ.. సైనికాధికారుల మధ్య చర్చలు
దిశ, వెబ్‌డెస్క్: ఇండియా, చైనా దేశాల మధ్య ఉద్రిక్తతలు ఇంకా సర్దుమనగకపోవడంతో మరోసారి ఇరుదేశాల సైనికాధికారుల స్థాయి చర్చలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 12న కార్ప్స్ కమాండర్ స్థాయి అధికారుల భేటీ జరగనుంది. ఘర్షణాత్మక ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణపై అధికారులు చర్చించనున్నారు. అలాగే సరిహద్దుల వద్ద ఉద్రిక్తత నివారణ, శీతాకాలంలో సరిహద్దుల వద్ద ఎదురయ్యే వాతావరణ పరిస్థితులపై కూడా చర్చించే అవకాశముంది. కాగా, ఈసారి చర్చల్లో లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారి పీజీకే మీనన్ పాల్గొననున్నట్లు […]
దిశ, వెబ్‌డెస్క్: ఇండియా, చైనా దేశాల మధ్య ఉద్రిక్తతలు ఇంకా సర్దుమనగకపోవడంతో మరోసారి ఇరుదేశాల సైనికాధికారుల స్థాయి చర్చలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 12న కార్ప్స్ కమాండర్ స్థాయి అధికారుల భేటీ జరగనుంది. ఘర్షణాత్మక ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణపై అధికారులు చర్చించనున్నారు.
అలాగే సరిహద్దుల వద్ద ఉద్రిక్తత నివారణ, శీతాకాలంలో సరిహద్దుల వద్ద ఎదురయ్యే వాతావరణ పరిస్థితులపై కూడా చర్చించే అవకాశముంది. కాగా, ఈసారి చర్చల్లో లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారి పీజీకే మీనన్ పాల్గొననున్నట్లు తెలుస్తోంది.