ఓటర్లకు గాలం.. బిర్యానీ ప్యాకెట్లలో ముక్కుపుడకలు

దిశ, వెబ్ డెస్క: కర్నూలు జిల్లాలో బిర్యానీ ప్యాకెట్లలో ముక్కు పుడకలు కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. నంద్యాల 12 వార్డులో బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేయగా.. అందులో ముక్కు పుడకలు ప్రత్యక్షమయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లారు. బిర్యానీ పొట్లాలు పంపిణీ చేస్తున్న ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ల దగ్గర నుంచి రూ.55వేల నగదు, 23 బంగారు ముక్కు పుడకలు, బిర్యానీ పొట్లాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురు కర్ణాటకకు చెందిన వ్యక్తులుగా […]

Update: 2021-03-10 04:32 GMT

దిశ, వెబ్ డెస్క: కర్నూలు జిల్లాలో బిర్యానీ ప్యాకెట్లలో ముక్కు పుడకలు కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. నంద్యాల 12 వార్డులో బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేయగా.. అందులో ముక్కు పుడకలు ప్రత్యక్షమయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లారు. బిర్యానీ పొట్లాలు పంపిణీ చేస్తున్న ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ల దగ్గర నుంచి రూ.55వేల నగదు, 23 బంగారు ముక్కు పుడకలు, బిర్యానీ పొట్లాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురు కర్ణాటకకు చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు.

నిందితులు 12 వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న ఖండే శ్యాంసుందర్‌లాల్‌ తరపున బిర్యానీ పొట్లాలు, ముక్కు పుడకలు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. ఓటర్లక గాలం వేసేందుకు ఇతర రాష్ట్రానికి చెందిన వారు అయితే ఎవరూ గుర్తుపట్టరని భావించి వారితో పంపిణీ చేయిస్తున్నట్లు సమాచారం. అయితే ప్రజలు వారిని పట్టుకోవడంతో అసలు గుట్టు రట్టైంది. పోలీసులు ఆముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల నియమావళి అతిక్రమణ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News